రెడ్ అలర్ట్… ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు

by Shamantha N |
rains
X

దిశ, వెబ్‌డెస్క్: ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం దూసుకొస్తుంది. గంటకు 32 కి.మీ వేగంతో ప్రయాణిస్తూ బలపడుతోంది. విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 700 కి.మీ దూరంలో ఒడిశాకు దక్షిణ ఆగ్నేయంగా 800 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయి ఉంది. మరికొన్ని గంటల్లో జవాద్ తుఫాన్‌గా మారే అవకాశముందని వాతావరణశాఖ స్పష్టం చేసింది.

రేపు ఉదయానికి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశముందని తెలిపింది. రేపు ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాన్ని తాకే అవకాశముందని పేర్కొంది. ఈ క్రమంలో రేపు ఉత్తరాంధ్ర జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఉత్తరాంధ్ర, ఒడిశాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేసింది.

Advertisement

Next Story

Most Viewed