- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రాణాలకు తెగించి కాపాడితే దాడులు చేస్తారా..?
దిశ ప్రతినిధి, వరంగల్ : ప్రాణాలకు తెగించి వైద్య సేవలందిస్తున్న డాక్టర్లపై దేశ వ్యాప్తంగా దాడులు పెరగడంపై వరంగల్ IMA నాయకులు తీవ్రంగా ఖండించారు. వైద్యులపై జరుగుతున్న దాడులను సమాజమంతా ముక్తకంఠంతో వ్యతిరేకించాలని వారు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా వైద్యులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ శుక్రవారం వరంగల్ లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్ ఎదుట నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వరంగల్ ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ సుధీర్ కుమార్ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి విజృంభించిన ప్రమాదకర పరిస్థితుల్లో డాక్టర్లు తమ ప్రాణాలను తెగించి సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. అయినా, తమపై దాడులు జరగడం హేయనీయమని అన్నారు.
సమాజంలో ఉన్న ప్రతిఒక్కరూ వైద్యులపై జరుగుతున్న దాడులను ఖండించాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు మరోసారి పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినమైన చట్టాలను అమల్లోకి తేవాలని సూచించారు. శుక్రవారం జరిగిన ప్రొటెస్ట్ డే సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్వర్యంలో వైద్యులు, వైద్య సిబ్బందితో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్లపై జరుగుతున్న దాడులపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఐఎంఏ నాయకులు హన్మకొండలో రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్‌కు ఆయన స్వగృహంలో మోమోరాండంను అందజేశారు.