- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మా వాళ్ల కోసం స్పెషల్ వార్డు ఇప్పించండి
దిశ, హైదరాబాద్: విధి నిర్వహణలో భాగంగా కరోనా బారిన పడ్డ వైద్యులు, వారి కుటుంబ సభ్యులకు నిమ్స్‌లో 30 పడకలు, వెంటిలేటర్లతో కూడిన ప్రత్యేక వార్డు కల్పించాలని వైద్యారోగ్య మంత్రి ఈటల రాజేందర్‌కు ఐఎంఏ, పీడియాట్రిక్ అకాడమీ ఆఫ్ తెలంగాణ విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు శనివారం ప్రతినిధుల బృందం మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. తెలంగాణ ప్రభుత్వ సారథ్యంలో వైద్యులు కరోనా వైరస్‌తో విశేషంగా పోరాడుతున్నారని, ఐఎంఏ పీడియాట్రిక్ అకాడమీ ఆఫ్ తెలంగాణ ప్రతినిధులు డాక్టర్ గార్లపాటి లక్ష్మణ్, డాక్టర్ ఎ.యశ్వంత్‌రావు, డాక్టర్ సీఎన్ రెడ్డి, డాక్టర్ భాస్కర్, డాక్టర్ విజేందర్ రెడ్డి, డాక్టర్ శ్యాంసుందర్‌లు మంత్రి ఈటల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రితో చర్చించారు. కరోనా మహమ్మారి పై వైద్యులు ముందుండి చేస్తున్న పోరాటంలో ఎందరో ఆ వ్యాధి బారిన పడ్డారనే విషయాన్ని సంఘం మంత్రి దృష్టికి తీసుకు వెళ్లింది. వైద్యులు, వారి కుటుంబ సభ్యుల శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం నిమ్స్‌లో ప్రత్యేక వార్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని వారంతా కోరారు.