- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ పాలసీ తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: కరోనా మహమ్మారి బారిన పడకుండా భౌతిక దూరాన్ని పాటిస్తూ తమ ఫిజికల్ ఫిట్ నెస్ ను కాపాడుకోవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. ఒలింపిక్ డే సందర్భంగా హైదరాబాద్ లోని తన నివాసం నుండి రాష్ట్రంలో ఒలింపిక్ ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు ఆయన ఒలింపిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నామన్నారు. అందులో భాగంగా క్రీడా పాలసీ రూపకల్పనపై క్యాబినెట్ సబ్ కమిటీని నియమించారన్నారు. క్రీడా పాలసీ సబ్ కమిటీలో అనుభవజ్ఞులైన మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావుల ఆలోచనల విధానము ద్వారా ప్రముఖ కోచ్ లు, క్రీడాకారులను సంప్రదించి దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని తీసుకవచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఒలింపిక్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ప్రేమ్ రాజ్, కార్యవర్గ సభ్యులుతోపాటు తదితరులు పాల్గొన్నారు.