- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘భారత్‌లో 41 లక్షల ఉద్యోగాలు పోయాయి’
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 (kovid -19) వ్యాప్తి కారణంగా దేశంలో 41 లక్షల మంది యువత ఉద్యోగాలు కోల్పోయారని అంతర్జాతీయ కార్మిక సంస్థ(International Labor Organization), ఆసియా అభివృద్ధి బ్యాంక్ (Asian Development Bank) సంయుక్త నివేదిక వెల్లడించింది. ఇందులో నిర్మాణ, వ్యవసాయ రంగ కార్మికులు ఎక్కువ మంది ఉద్యోగాలను కోల్పోయారని నివేదిక తెలిపింది.
‘ఆసియా, పసిఫిక్ దేశాలలో కొవిడ్-19 పరిష్కారం – యువత ఉపాధి సంక్షోభం’ పేరున మంగళవారం వెలువడిన నివేదికలో ఏడు కీలక రంగాల్లో ఈ ఉద్యోగ నష్టాలు అధికంగా ఉన్నట్టు వెల్లడించింది. కరోనా సంక్షోభం వల్ల యువత ఉపాధి అవకాశాల్లో తీవ్రమైన సవాళ్లు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. అనూహ్యమైన ఈ సంక్షోభంలో 15-24 ఏళ్ల యువత, 25 ఏళ్లు పైబడిన వయస్సు వారి కంటే ఎక్కువ నష్టపోయారని, వీరు సుధీర్ఘ కాలం పాటు ఆర్థిక, సామాజిక వ్యయాలను భరించే ప్రమాదం ఉందని నివేదిక పేర్కొంది.
ఈ నివేదిక ప్రాంతీయ అంచనాల ఆధారంగా, వివిధ దేశాల్లో అందుబాటులో ఉన్న నిరుద్యోగ డేటా ఆధారంగా అంచనా వేసింది. మొత్తం 2020 ఏడాదికి 13 దేశాల్లో కోటి నుంచి కోటిన్నర యువత ఉద్యోగాలు కోల్పోవచ్చని నివేదిక అంచనా వేసింది. నివేదిక ప్రకారం.. ఉద్యోగాలను కోల్పోయే ఎక్కువ భాగం యువతలో సగం మంది సంక్షోభం కారణంగా తీవ్రంగా నష్టపోయిన నాలుగు రంగాల్లో పనిచేస్తున్నారు.
అవి.. టోకు-రిటైల్ వ్యాపారం (Wholesale-retail business), మరమ్మత్తు-తయారీ (Repair-making), అద్దె-వ్యాపార సేవలు (Rental-business services), వసతి-ఆహార సేవల రంగాల్లో ఉన్నట్టు నివేదిక స్పష్టం చేసింది. ‘కొవిడ్-19 (kovid -19) రికవరీలో యువత ఉపాధికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా స్థిరమైన వృద్ధి,సామాజిక స్థిరత్వం భవిష్యత్తు అవకాశాలను మెరుగు పరుస్తుంది’అని ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఎన్‌జీవో, సివిల్ సొసైటీ సెంటర్ హెడ్ క్రిస్ మోరిస్ అన్నారు.