- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
15టన్నుల యూరియా పట్టివేత..
దిశ, క్రైమ్ బ్యూరో: ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై అందజేసిన యూరియాను అక్రమంగా నిల్వ చేసిన వ్యక్తిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నగరంలోని కింగ్ కోఠికి చెందిన నిశాంత్, చందూలాల్ బారాదరి వద్ద జగదాంబ ఇండస్ట్రీ పేరుతో ఫైబర్ ప్లేట్స్ తయారీ యూనిట్‌ను నిర్వహిస్తున్నాడు. ఫైబర్ ప్లేట్స్ తయారీకి అవసరమైన ముడిపదార్థాల కోసం ఇతర పదార్థాలతో పాటు యూరియాను కలిపేందుకు నిర్ణయించాడు. అందుకు హరూన్ అనే వ్యక్తి నుంచి రాష్ట్ర ప్రభుత్వం అందించిన సబ్సిడీ యూరియాను రైతుల ద్వారా సేకరిస్తున్నాడు.
వాటికి ఎలాంటి బిల్లులు లేకుండానే యూరియా బస్తాలను చందులాల్ బారాదరి వద్ద గల జగదాంబ ఇండస్ట్రీకి తరలిస్తున్నారు. దీనిని హరూన్ అనే వ్యక్తి నుంచి నిశాంత్ అక్రమంగా కొనుగోలు చేసి ఈ దందాకు పాల్పడుతున్నాడు. విశ్వాసనీయ సమాచారం అందుకున్న సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి, స్థానిక కామాటీపురా పోలీసులు సంయుక్తంగా జగదాంబ ఇండస్ట్రీపై దాడి చేసి అక్రమంగా నిల్వ ఉంచిన సబ్సిడీ యూరియాను గుర్తించారు.
ఈ సందర్భంగా జువారీ అగ్రో కెమికల్స్ లిమిటెడ్ కంపెనీ తయారు చేసిన 325 బస్తాల జై కిసాన్ యూరియా.. మొత్తం 15 టన్నులను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.5 లక్షల ఉంటుందని అధికారులు సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ అడిషనల్ డీసీపీ చక్రవర్తి గుమ్మి తెలిపారు. అనంతరం నిశాంత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును ఛేదించిన ఇన్‌స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర, ఎస్ఐలు నరేందర్, శ్రీశైలం, మహమ్మద్ తాఖుద్దీన్, రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి ఎం.హరినాథ్, స్థానిక కామాటిపురా పోలీసులను అడిషనల్ డీసీపీ అభినందించారు.