మద్యం కేసులో ‘ఖాకీలు’ అరెస్టు..

by  |
మద్యం కేసులో ‘ఖాకీలు’ అరెస్టు..
X

దిశ, వెబ్‌డెస్క్ :

ఏపీలో జగన్ ప్రభుత్వం కొలువుదీరాక మ‌ద్యపాన నిషేధం అమలు చేసిన విషయం తెలిసిందే. అయితే, కొందరు దుండగులు ఇత‌ర రాష్ట్రాల నుంచి అక్ర‌మంగా మ‌ద్యాన్ని ఏపీలోకి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో తెలంగాణ నుంచి కూడా ఏపీకి మద్యం నిల్వలు తరలుతున్నాయి. దీంతో అప్రమత్తమైన ఏపీ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే కర్ణాటకలోని తుంకూర్ జిల్లా పావగడ తాలూకాలోని జాలేడు గ్రామం నుంచి ఇద్దరు వ్యక్తులు అక్రమంగా మద్యాన్ని ఏపీకి సరఫరా చేస్తున్నారని గుర్తించారు.

దీనిపై దర్యాప్తు చేయగా.. కొందరు అక్రమార్కులతో పోలీసులు కుమ్మక్కయ్యారనే విషయం వెల్లడైంది. రూ. 50 వేలు లంచం తీసుకుని మద్యం నిల్వలను రాష్ట్రంలోనికి అనుమతించినట్లు అంత‌ర్గ‌త విచారణలో తేలింది. దీంతో స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరోకు చెందిన ఎస్సైలు జిలాన్ బాషా, శివప్రసాద్‌లతోపాటు కానిస్టేబుళ్లు మోహన్, మురళీకృష్ణలను అరెస్టు చేసినట్లు ఎస్పీ రామ్​ మోహన్ తెలిపారు. వారిని జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపించినట్లు తెలిపారు.


Next Story

Most Viewed