అక్రమంగా గ్రావెల్ దందా.. పట్టించునే నాధుడెవరు?

by Sridhar Babu |
అక్రమంగా గ్రావెల్ దందా.. పట్టించునే నాధుడెవరు?
X

దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పగిడేరు ప్రాంతంలోని కొంతమంది అక్రమార్కులకు బెదురులేదు…దెబ్బకు తిరుగులేదు అన్నచందంగా అక్రమ గ్రావెల్ తోలకాలు చేస్తున్నారని మండల ప్రజలు అంటున్నారు .శుక్రవారం పగిడేరు ప్రాంతంలో అక్రమార్కులు పట్టపగలు అందరరూ చూస్తుండగానే గ్రావెల్ ను తోడేస్తున్నారని చుట్టూ స్థానికులు వాపోతున్నారు. అధికారుల అనుమతులతో పనిలేదనే విధంగా అక్రమార్కులు వ్యవహరిస్తున్నారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. అక్రమార్కులు అక్రమంగా గ్రావెల్ ను అందినకాడికి దోచుకుంటూ కొన్ని లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని పలువురు తెలుపుతున్నారు.

పట్టపగలే అక్రమంగా గ్రావెల్ దందా జరుగుతున్నా.. అధికారులు నిమ్మకునిరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు అంటున్నారు. గ్రావెల్ దందా పెద్ద ఎత్తున జరుగుతున్నా.. ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని మండల ప్రజలు మాట్లాడుతున్నారు. అక్రమార్కులు ఇచ్చే కాసులకు కక్కుర్తి పడి అధికారులు ఏ మాత్రం పనిచేయడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ సంపదను అక్రమార్కులు కొల్లగొడుతున్నా పట్టించుకున్న నాధుడే కరువయ్యారని ప్రజలు గుసగుసలాడుతున్నారు. ఈ దందా గురించి పత్రికా విలేకరులు పత్రికల్లో ప్రచురిస్తే తమకు ఏం భయంలేదని, అధికారులే తోడుగా ఉన్నారనే విధంగా అక్రమార్కులు వ్యవహరిస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. అక్రమార్కులతో అధికారులే చేతులు కలిపితే ఈ అక్రమ గ్రావెల్ దందాను ఆపేదెవరని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి అక్రమంగా గ్రావెల్ తోలకాలు చేస్తున్నవారిపై పీడి యాక్ట్ కేసు నమోదు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story