- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేవాలయ భూమిలో వెలసిన గోడౌన్.. హెచ్చరించిన బీజేపీ నాయకులు
దిశ, శంషాబాద్: దేవాలయ భూములను ఆక్రమించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బీజేవైఎం రాష్ట్ర అడిషనల్ ప్రధాన కార్యదర్శి మహేందర్ డిమాండ్ చేశారు. దేవాలయ భూములను కాపాడాలని కోరుతూ బీజేపీ నాయకులతో కలిసి సోమవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ సాతంరాయ్ లోని శ్రీ రామచంద్ర స్వామి ఆలయ భూములలో వెలసిన భారీ గోడ నిర్మాణాన్ని పరిశీలించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సాతంరాయ్ లోని అతి పురాతన శ్రీ కోదండ రామాలయానికి సంబంధించిన భూములు ఆక్రమణకు గురవుతున్నాయన్నారు.
ఆలయ భూములను గుర్తించి, సరిహద్దులు నిర్ణయించి అక్రమంగా నిర్మించిన కంపెనీలను, గోడను కూల్చి వేయడంతోపాటు అక్రమ దారులపై రెవిన్యూ, దేవాదాయ శాఖ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దేవాలయ భూములను కాపాడటంలో అధికారుల నిర్లక్ష్యం వహించి, అక్రమ దారులకు వత్తాసు పలుకుతే బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తుందని హెచ్చరించారు. దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కొప్పుల ప్రశాంత్, గురువారెడ్డి, దేవేందర్, మహిపాల్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, వంశీ యాదవ్, స్వామి, వీరేశం, విష్ణువర్ధన్ రెడ్డి, బీజేవైఎం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.