- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూల్స్ బ్రేక్ చేస్తూ అక్రమ నిర్మాణాలు.. కన్నెత్తి చూడని అధికారులు
దిశ, ఫరూక్ నగర్ : తప్పు చేస్తే శిక్షించేది అధికారులే.. అలాంటి అధికారులే నిద్ర మత్తులో ఉంటే ఇక తప్పు చేసే వారిని పట్టించుకునే వారు ఎవరూ.? అంటూ పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. షాద్‌నగర్ పట్టణంలో నిబంధనల ప్రకారం మున్సిపాలిటీ పరిధిలో జి+2 వరకే పర్మిషన్ ఉంది. కానీ, నిబంధనలకు విరుద్ధంగా పట్టణంలోని మెయిన్ రోడ్‌లో సెల్లార్‌తో కలిపి 4 అంతస్తులు నిర్మించారు. ఇలా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
గతంలో ఇదే అక్రమ కట్టడంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అప్పుడు స్పందించిన మున్సిపల్ అధికారులు సెప్టెంబర్ 7వ తేదీన సదరు బిల్డింగ్ యజమానికి నోటీసులు జారీ చేశారు. కానీ, ఆ యజమాని నోటీసులు బేఖాతర్ చేస్తూ భవన నిర్మాణం కొనసాగించారు. ఇప్పుడు ఆ బిల్డింగ్ నిర్మాణం ప్రారంభ దశకు వచ్చింది. ఎక్కడైనా తప్పు జరిగితే ఉరుకులు పరుగులు పెట్టే అధికారులు.. షాద్‌నగర్ నడి రోడ్డున నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణం చేపడితే చర్యలు ఎందుకు తీసుకోవడంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు.