ఇల్లీ బేబి కొత్త అవతారం…

by Shyam |   ( Updated:2020-04-07 03:01:12.0  )
ఇల్లీ బేబి కొత్త అవతారం…
X

దిశ, వెబ్‌డెస్క్: గోవా బ్యూటీ ఇలియానా నడుము అందాలతో కుర్రకారు మతి పోగొట్టింది. ‘దేవదాసు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. యువతను తన అందానికి బానిసలను చేసింది. తొలి సినిమాతోనే ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుని తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ హీరోయిన్‌గా ఎదిగింది. కానీ అదే టైంలో బాలీవుడ్‌లో అవకాశాలు రావడంతో.. టాలీవుడ్‌ను కాదని ముంబైకి మకాం మార్చింది. అక్కడ ఒకటి రెండు సినిమాలు తప్పితే… పెద్దగా విజయవంతం కాకపోవడంతో కెరియర్ డీలా పడిపోయింది. దీంతో చేసేదేమీ లేక మళ్లీ తెలుగు సినీరంగం వైపే చూసినా… టాలీవుడ్‌లో సెకండ్ ఇన్నింగ్స్ అంతగా కలిసి రాలేదు. ప్రస్తుతం తెలుగులో రవితేజ సరసన ఓ సినిమా చేస్తున్న భామ… బాలీవుడ్‌లో ఓ సినిమాకు కమిట్ అయినట్లు సమాచారం.

అయితే కొత్త హీరోయిన్ల రాకతో తన క్రేజ్ తగ్గిపోయిందని రియలైజ్ అయిన ఇల్లీ బేబి నటనా జీవితాన్ని పక్కనెట్టేసి… యాంకర్‌గా కెరియర్‌ను స్టార్ట్ చేయాలని డిసైడ్ అయిందట. స్పోర్ట్స్ చానల్ యాంకర్‌గా కొత్త అవతారమెత్తే ఆలోచనలో ఉందట. ఈ క్రమంలో తనను తాను నిరూపించుకునే పనిలో ఉన్న అందాల భామ… ఓ చానల్ యాజమాన్యంతో డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. ఆల్రెడీ కమిట్ అయిన సినిమా షూటింగ్స్ పూర్తి కాగానే.. పూర్తి యాంకర్‌గా మారిపోనుందని తెలుస్తోంది.

Tags: Ileana, Goa Beauty, Anchor, Bollywood, Tollywood

Advertisement

Next Story