టాలీవుడ్‌పై ఇల్లీ బేబీ టంగ్ స్లిప్

by Jakkula Samataha |
టాలీవుడ్‌పై ఇల్లీ బేబీ టంగ్ స్లిప్
X

గోవా బ్యూటీ ఇలియానా నడుము అందాలతో మాయ చేసి టాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండస్ట్రీ మొత్తాన్ని నడుమున కట్టేసింది. దేవదాస్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ..ఆ సినిమా సక్సెస్ తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశమే లేకుండా పోయింది. చేతి నిండా సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా అందలం ఎక్కించారు అభిమానులు. తను చేసే ప్రతి సినిమా సక్సెస్ కాకపోయినా సరే..తనను మాత్రం నెం.1 హీరోయిన్ గానే పరిగణించారు. పోకిరి సినిమాతో పాపులర్ అయిపోయిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత స్టార్ హీరో సినిమాల్లోనే నటించి మెప్పించింది. ఇక్కడ స్టార్ రేంజ్ అందుకుంటూనే బాలీవుడ్‌పై మోజుతో అక్కడికి చెక్కేసిన బ్యూటీ..ఇప్పుడు తను ఎదిగేందుకు పునాది వేసిన టాలీవుడ్ పైనే విమర్శలు గుప్పించింది.

సుశాంత్ సింగ్ మరణంతో బాలీవుడ్‌లో నెపోటిజం గురించి చర్చ జరుగుతుండగా..అసలు టాలీవుడ్ మొత్తం నెపోటిజం‌పైనే నడుస్తుందని స్టేట్‌మెంట్ ఇచ్చింది. బయట నుంచి వచ్చిన వ్యక్తులు అక్కడ ఎదగలేరని అన్నది. దాంతో తెలుగు ఆడియన్స్ మండిపోతున్నారు. సోషల్ మీడియాలో గట్టిగానే చురకలు అంటిస్తున్నారు. అసలు టాలీవుడ్ నిన్ను స్టార్‌ను చేయకుంటే ఎక్కడ ఉండేదానివో నీకు నువ్వు ప్రశ్నించుకుంటే మంచిదంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed