- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎఫ్‌సీ గోవా అద్భుత విజయం
దిశ, స్పోర్ట్స్ : ఐఎస్ఎల్ 2020/21 సీజన్‌లో భాగంగా బుధవారం రాత్రి తిలక్ మైదాన్‌లో హైదరాబాద్ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో ఎఫ్‌సీ గోవా అద్భుత విజయాన్ని సాధించింది. మ్యాచ్ చివరి వరకు 0-1 గోల్స్ తేడాతో వెనుకబడిన గోవా.. ఆఖరి మూడు నిమిషాల్లో రెండు గోల్స్ చేసి ఈ ఏడాదికి చివరి మ్యాచ్‌ను తమ సొంతం చేసుకుంది. టాస్ గెలిచిన ఎఫ్‌సీ గోవా కుడి నుంచి ఎడమకు ఎటాక్ చేయడానికి నిర్ణయించుకుంది. 10వ నిమిషంలోనే ఎఫ్‌సీజీకి కార్నర్ లభించినా.. దాన్ని గోల్‌గా మార్చలేకపోయింది. తొలి అర్దభాగంలో ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు బంతి కోసం పోరాడాయి. ఇరు జట్ల డిఫెన్స్ బలంగా ఉండటంతో గోల్స్ చేయడంలో విఫలమయ్యాయి.
కాగా, రెండో అర్దభాగం మొదటి నుంచి హైదరాబాద్ ఎఫ్‌సీ దూకుడుగా ఆడింది. ఈ క్రమంలో ఆషిశ్ రాయ్ ఇచ్చిన పాస్‌ను హైదరాబాద్ కెప్టెన్ అరిడానే శాంటన గోల్‌గా మార్చాడు. దీంతో హైదరాబాద్ ఎఫ్‌సీ 1-0 ఆధిక్యంలోకి దూసుకొని పోయింది. ఆ తర్వాత ఎఫ్‌సీ గోవా పలుమార్లు గోల్ పోస్టుపై దాడి చేసినా ఫలితం లభించలేదు. మ్యాచ్ చివరి వరకు హైదరాబాద్ అదే ఆధిక్యతను నిలుపుకుంటూ వచ్చింది. 71వ నిమిషంలో హైదరాబాద్ కెప్టెన్ మరో గోల్ చేసినా అది ఆఫ్ సైడ్ అవడంతో ఫలితం లేకపోయింది.
మ్యాచ్ మరో మూడు నిమిషాల్లో ముగుస్తుందనగా.. గోవా జట్టు మ్యాజిక్ చేసింది. 87వ నిమిషంలో ఎడ్యూ బెడియా ఇచ్చిన పాస్‌ను ఇషాంత్ పండిట గోల్‌గా మార్చాడు. దీంతో ఇరు జట్ల స్కోర్ సమం అయ్యింది. రిఫరీ నిర్ణీత సమయానికి మూడు నిమిషాలు ఇంజ్యూరీ టైం జత చేశాడు. ఆ సమయంలోనే ఇగొర్ అంగులో అద్భుతమైన గోల్ చేయడంతో హైదరాబాద్ జట్టు షాక్‌కు గురైంది. అప్పటి వరకు ఆధిక్యంలో ఉన్న హైదరాబాద్ 2-1 తేడాతో ఒక్కసారిగా ఓటమి పాలయ్యింది. ఇది హైదరాబాద్ జట్టుకు వరుసగా మూడో ఓటమి కాగా, గోవాకు రెండో విజయం. విన్నింగ్ పాస్ అవార్డు బెడియాకు, హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇగొర్ అంగులోకు లభించింది.