ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తే.. ఆ విద్యార్థులకు స్మార్ట్ ఫోన్‌లు ఇవ్వాలి

by Shyam |
ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తే.. ఆ విద్యార్థులకు స్మార్ట్ ఫోన్‌లు ఇవ్వాలి
X

దిశ, మునుగోడు: జిల్లా సాంఘిక సంక్షేమ స్థాయి సంఘం సమావేశం మంగళవారం నల్లగొండ జెడ్పీ కార్యాలయంలో చైర్మెన్ నారబోయిన స్వరూప రాణి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు అధికారులకు పలు సూచనలు చేశారు. కోవిడ్-19 విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం, అధికారులు చేస్తున్న సేవలు అభినందనీయమని తెలిపారు. ప్రభుత్వం ఆదేశానుసారం హాస్టల్, గురుకుల పాఠశాలలను కరోనా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించడానికి అధికారులందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ ఖాళీ సమయంలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ మరియు గురుకుల పాఠశాలల్లో ఏవేని రిపేర్లు ఉన్నచో తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాల్సి వస్తే, స్మార్ట్ ఫోన్స్ అందుబాటులో లేని నిరుపేద విద్యార్థులకు మెస్ చార్జీలకు బదులుగా స్మార్ట్ ఫోన్స్ అందించవలసిందిగా సభ్యులు తెలియజేశారు.

Advertisement

Next Story