- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా పేషెంట్లకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ తప్పనిసరి కాదు : ఐసీఎంఆర్
న్యూఢిల్లీ : కరోనా పేషెంట్లకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ తప్పనిసరిగా వినియోగించాలని రికమండ్ చేయట్లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) తెలిపింది. ఈ మందు నిజంగానే కొవిడ్-19 పేషెంట్లపై ప్రభావితంగా పనిచేస్తున్నదా? లేదా? అనేది నిర్ధారణ అయ్యే వరకు ఈ మందును తీసుకోవచ్చని చెప్పబోమని వెల్లడించింది. ఐసీఎంఆర్ డాక్టర్ కేకే గంగఖేద్కర్ మాట్లాడుతూ.. హైడ్రాక్సీ క్లోరోక్విన్ తప్పనిసరి కాదన్న విషయమాన్ని మనమందరం ముందు గుర్తుంచుకోవాలని చెప్పారు. ఈ మందు నిజంగానే ఇన్ఫెక్షన్‌ను తగ్గిస్తుందా? లేదా? అనేది టెస్టుల తర్వాతే తెలుస్తుందని వివరించారు. లక్షణాలు కనిపించిన కరోనా పేషెంట్లపై వైద్యులు ఈ మందుతో ఇప్పటికీ పరీక్షలు జరుపుతూనే ఉన్నారని పేర్కొన్నారు. సంతృప్తికర ఫలితాలు వెలువడేవరకు ఈ మందును ఎవరికీ రికమండ్ చేయబోమని తెలిపారు. ఐసీఎంఆర్ ప్రకారం.. కొవిడ్ 19 పేషెంట్లు లేదా అనుమానితులతో సన్నిహితంగా మెలిగిన వైరస్ లక్షణాలు కనిపించని వైద్య సిబ్బందికి ఈ మందును వినియోగిస్తున్నారు.
Tags: hydroxy chloroquine, ICMR, recommend, testing, not mandatory