విరాళమిచ్చిన ఐసిఐసిఐ గ్రూప్!

by Harish |   ( Updated:2020-04-14 05:39:33.0  )
విరాళమిచ్చిన ఐసిఐసిఐ గ్రూప్!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 కట్టడి కోసం విరాళమిచ్చేందుకు దిగ్గజ కంపెనీ ఐసిఐసిఐ గ్రూప్ ముందుకొచ్చింది. ఇప్పటికే కరోనా వ్యాప్తిని నిలువరించేందుకు 2 లక్షలకు పైగా మాస్కులను, 40 వేలకు మించి ఎన్95 మాస్కులను, 20 వేల లీటర్ల శానిటైజర్లు, 16 వేలు గ్లోవ్స్, 5 వేలకు పైగా పీపీఈలు, 2500 పైగా ప్రొటెక్టివ్ ఐ షీల్డ్‌లు, 50 థర్మల్ స్కానర్లను పలు ఆసుపత్రులకు, రాష్ట్ర ప్రభుత్వాల శాఖలకు అందించినట్టు సందీప్ తెలిపారు.

దేశీయంగా అతిపెద్ద ప్రైవేటు బ్యాంకును నిర్వహిస్తున్న ఐసిఐసిఐ గ్రూప్ ప్రభుత్వానికి రూ. 100 కోట్ల విరాళాన్ని ఇస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. ఈ మొత్తంలో ప్రధాని మోదీ ప్రారంభించిన పీఎమ్ కేర్స్‌కు రూ. 80 కోట్లను, రాష్ట్ర ప్రభుత్వాలకు, ఇతర సంస్థలకు రూ. 20 కోట్లను ఇవ్వనున్నట్లు ఐసిఐసిఐ బ్యాంక్ ప్రెసిడెంట్ సందీప్ వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో దేశ ప్రజలకు అండగా నిలుస్తామని, అందరం కలిసి కరోనాపై పోరాడదామని సందీప్ అన్నారు. తాము అందించే విరాళం సామాజిక బాధ్యతలో భాగంగా ఇస్తున్నామని, కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రజలకు సేవ చేసేందుకు తామెప్పుడూ ముందుంటామని సందీప్ చెప్పారు.

Tags: ICICI Group, COVID-19 relief, coronavirus

Advertisement

Next Story

Most Viewed