కష్టకాలంలోనూ జీతాలు పెంచుతున్న ఐసీఐసీఐ బ్యాంక్!

by Harish |
కష్టకాలంలోనూ జీతాలు పెంచుతున్న ఐసీఐసీఐ బ్యాంక్!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా సంక్షోభం కొనసాగుతున్నప్పటికీ ప్రైవేట్ దిగ్గజ బ్యాంక్ ఐసీఐసీఐ తమ ఉద్యోగులకు జీతాలను పెంచాలని నిర్ణయించింది. సంస్థలో పని చేస్తున్న దాదాపు 80 వేల మందికి జీతాలను పెంచాలని ఐసీఐసీఐ భావిస్తోంది. మొత్తం ఉద్యోగుల్లో ఇది 94 శాతం. వీరికి 8 శాతం వరకూ జీతాలను పెంచనుంది. కరోనా వైరస్ వ్యాప్తి విపరీతంగా ఉన్నప్పటికీ తమ ఉద్యోగులు సేవలందించారని, సంక్షోభం సమయంలోనూ వారి సేవలను గుర్తిస్తూ ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని పేర్కొంది. కస్టమర్లకు నేరుగా సేవలందించే ఎం1 లెవల్ ఉద్యోగులు, అంతకంటే తక్కువ గ్రేడ్ ఉన్న వారికి ఈ పెంపు ఉంటుందని, ఇది జులై నుంచి అమల్లోకి వస్తాయని సంస్థ తెలిపింది. లాక్‌డౌన్ సమయంలో ఐసీఐసీఐ బ్యాంక్ కార్యకలాపాలు కొనసాగటంలో వీరి పాత్ర ముఖ్యమైనదని సంస్థ పేర్కొంది. ఇతర సంస్థలన్నీ కంపెనీల్లో వేతనాలు నిలిపేయడం, కోతను అమలు చేయడం చేస్తుంటే ఐసీఐసీఐ జీతాలను పెంచడం ద్వార ఉద్యోగుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచడం హర్షించదగ్గ విషయమని బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed