ఫాస్టాగ్ కోసం ఐసీఐసీఐ, ఫోన్‌పే కీలక ఒప్పందం

by Shamantha N |
ఫాస్టాగ్ కోసం ఐసీఐసీఐ, ఫోన్‌పే కీలక ఒప్పందం
X

దిశ, వెబ్‌డెస్క్: ఫాస్టాగ్ సేవలను మరింత సులభతరం చేసేందుకు ఐసీఐసీఐ బ్యంక్, ఫోన్‌పే సంస్థలు భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. దీని ద్వారా సుమారు 28 కోట్ల మంది ఫోన్‌పే కస్టమర్లు యాప్ నుంచే యూపీఐ ద్వారా టోల్‌ప్లాజాల వద్ద ఐసీఐసీఐ ఫాస్టాగ్‌ చెల్లింపులను చేయవచ్చని ఐసీఐసీఐ బ్యాంక్ గురువారం వెల్లడించింది. ఇరు సంస్థల మధ్య జరిగిన ఈ ఒప్పందంతో 28 కోట్ల మంది కస్టమర్లు ఐసీఐసీఐ బ్యాకు ఫాస్టాగ్ వివరాల సులభంగా తీసుకోవచ్చని, ఐసీఐసీఐ బ్యాంక్ అకౌట్ ఉన్న కస్టమర్లు ఫాస్టాగ్‌ను ఉచితంగా వారి ఇంటి అడ్రస్‌కు అందించనున్నట్టు ఇరు సంస్థలు సంయుక్త ప్రకటన చేశాయి. ఐసీఐసీఐ అకౌంట్ లేని కస్టమర్లు కూడా ఫాస్టాగ్‌ను పొందవచ్చని, యూపీఐ ద్వారా రీఛార్జ్ చేసుకునే వీలుంటుందని ఫోన్‌పే వివరించింది. ఈ భాగస్వామ్యంలో వినియోగదారులకు ఫాస్టాగ్ ఇబ్బందులు ఉండవని వెల్లడించింది.

Advertisement

Next Story