1,15,000 నష్ట పరిహారం చెల్లించిన ఐసీఐసీఐ బ్యాంకు

by Shyam |   ( Updated:2021-07-10 10:58:17.0  )
ICICI Bank New Rules
X

దిశ, చార్మినార్ : ఐసీఐసీఐ బ్యాంకు విధుల్లో చేరినప్పుడు సెక్యూరిటీ కింద ఇచ్చిన సర్టిఫికేట్లు, ఉద్యోగం మానేశాక తిరిగి ఇవ్వడంలో బ్యాంకు అధికారులు జాప్యం వహిస్తున్నారని సిటీ సివిల్ కోర్టులో ఉద్యోగిని శ్రీనిజ 25లక్షల నష్టపరిహారం కేసు వేశారు. శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ ఉభయ పక్షాలకు రాజీ కుదిర్చి ఈ వివాదాన్ని పరిష్కరించింది. శ్రీనిజ విద్యార్హతల సర్టిఫికేట్లు పోయినట్లు ఐసీఐసీఐ అంగీకరించింది. వారి సమక్షంలోనే బ్యాంకు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ మేరకు సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్ పర్సన్ డాక్టర్ సుమలత సమక్షంలో లక్షా 15 వేల రూపాయల నష్టపరిహారాన్ని శ్రీనిజ కు ఐసీఐసీఐ అధికారులు అందజేశారు. రాజీ పత్రాలను న్యాయమూర్తి డాక్టర్ సుమలత ఇరు పక్షాల వారికి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లోక్ అదాలత్ బెంచి న్యాయమూర్తి జీవన్ కుమార్, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కే మురళి మోహన్, ఐసిఐసిఐ బ్యాంక్ అధికారి అనంత భట్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed