- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సొంతింటి కల నేరవేర్చుకోవాలనుకునే వారికి ఐసీఐసీఐ గుడ్‌న్యూస్
దిశ, వెబ్‌డెస్క్ : సొంత ఇంటిని నిర్మించుకోవాలనుకునే వారికి గృహ రుణాలకు ఈ నెల సరైన అవకాశాలున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ, ప్రైవేట్ రంగ కోటక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించగా, శుక్రవారం ఐసీఐసీఐ బ్యాంకు సైతం గృహ రుణాలపై వడ్డీ రేట్లను 6.70 శాతానికి తగ్గించింది. తాజా వడ్డీ రేట్లు గత పదేళ్లలో అతి తక్కువ అని, సవరించిన కొత్త రేట్లు శుక్రవారం నుంచే అమల్లోకి వస్తాయని బ్యాంకు ప్రకటించింది. సవరణ రేట్లు రూ. 75 లక్షల వరకు గృహ రుణాల కోసం వినియోగదారులు ప్రయోజనాలను పొందవచ్చని, రూ. 75 లక్షలకు పైన గృహ రుణాలకు 6.75 శాతం వడ్డీ రేటు వర్తిస్తుందని బ్యాంకు తెలిపింది.
ఈ అవకాశం మార్చి 31 వరకు వర్తిస్తాయని పేర్కొంది. బ్యాంకు కస్టమర్లతో పాటు ఇళ్లను కొనాలనుకునేవారు బ్యాంకు వెబ్‌సైట్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా గృహ రుణాల కోసం డిజిటల్‌గా దరఖాస్తు చేసుకోవచ్చని బ్యాంకు వెల్లడించింది. ‘గత కొన్ని నెలలుగా స్వంత ఇళ్లను కోరుకునేవారి నుంచి గృహ రుణాలకు డిమాండ్ పుంజుకుంది. ఇది వారికి సరైన సమయం. ప్రస్తుతం ఉన్న తక్కువ వడ్డీ రేట్లను పరిగణలోకి తీసుకు ఇళ్లను తీసుకోవచ్చని’ ఐసీఐసీఐ బ్యాంక్ సెక్యూర్డ్-అసెట్స్ హెడ్ రవి నారాయణన్ చెప్పారు. కాగా, తాజాగా ఎస్‌బీఐ గృహ రుణాల వడ్డీ రేటును 6.70 శాతానికి, కోటక్ బ్యాంక్ 6.65 శాతానికి, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 6.75 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ వడ్డీ రేటు మార్చి 31 వరకు అమలు కానున్నాయి.