Champions Trophy: రఫ్పాడించిన న్యూజిలాండ్ బ్యాటర్లు.. సెమీస్‌లో సౌతాఫ్రికా ఎదుట భారీ టార్గెట్

by Gantepaka Srikanth |   ( Updated:2025-03-05 12:52:29.0  )
Champions Trophy: రఫ్పాడించిన న్యూజిలాండ్ బ్యాటర్లు.. సెమీస్‌లో సౌతాఫ్రికా ఎదుట భారీ టార్గెట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీ-2025(Champions Trophy 2025)లో భాగంగా పాకిస్తాన్‌(Pakistan)లోని లాహోర్(Lahore) మైదానం వేదికగా జరుగుతోన్న సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాటర్లు రఫ్పాడించారు. సమిష్టి కృషితో మొదటి నుంచి దూకుడు రాణించారు. మొత్తంగా 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 362 పరుగులు చేశారు. సౌతాఫ్రికా గెలవాలంటే 363 పరుగులు చేయాల్సి ఉంది. న్యూజిలాండ్ బ్యాటర్లలో విల్ యంగ్ 21 పరుగులతో నిరాశపర్చినా.. రచిన్ రవీంద్ర(108), కేన్ విలియమ్సన్(102), డారీ మిచెల్(49), ఫిలిప్స్(49) పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరును అందించారు. ఇక సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి మూడు వికెట్లు, కాగిసో రబాడా రెండు వికెట్లు, వియాన్ ఒక వికెట్ తీశారు. కాగా, ఇప్పటికే టీమిండియా ఫైనల్‌కు వెళ్లింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు దుబాయ్ వేదికగా జరిగే ఫైనల్‌లో భారత్‌తో తలపడనుంది.

Next Story