- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు జట్టు కూర్పుపై కసరత్తు
దిశ, స్పోర్ట్స్ : డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే తుది జట్టు కూర్పుపై కెప్టెన్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ రవిశాస్త్రి కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా జట్టులో బౌలర్లు కూర్పుపైనే చర్చ జరుగుతున్నది. ఇంగ్లాండ్‌లోని సౌతాంప్టన్ ఏజెస్ బౌల్ స్టేడియంలోని పిచ్ బౌలర్లకు సహకరించే అవకాశం ఉన్నది. దీంతో ఎంత మంది పేసర్లు, స్పిన్నర్లలో బరిలోకి దిగాలనే విషయంపై యాజమాన్యం మల్లగుల్లాలు పడుతున్నది. ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పన్నర్లలో బరిలోకి దిగడమా? లేదంటే నలుగురు పేసర్లు, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో ఆడటమా అనే విషయంపై సందిగ్దత నెలకొన్నది.
ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని భావిస్తే మాత్రం తుది జట్టులో అశ్విన్‌తో పాటు రవీంద్ర జడేజా ఉండే అవకాశం ఉన్నది. సౌతాంప్టన్ వికెట్ పేసర్లకు అనుకూలిస్తుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో నలుగురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లలో బరిలోకి దిగితే ఎలా ఉంటుందో అని కూడా ఆలోచిస్తున్నారు. అశ్విన్, జడేజా ఇద్దరికీ బ్యాటింగ్ చేయడం కూడా వచ్చు. టెస్టు మ్యాచ్‌లలో సుదీర్ఘంగా బ్యాటింగ్ చేసే సత్తా ఉన్నది. కాబట్టి వీరిద్దరితో పాటు నలుగురు పేసర్లతో బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.