- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్త సీఈవో కోసం ఐసీసీ అన్వేషణ
దిశ, స్పోర్ట్స్ : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లో కీలకమైన సీఈవో పోస్టు ప్రస్తుతం ఖాళీగా ఉన్నది. సీఈవోగా వ్యవహరిస్తున్న మనూ సాహ్నీపై పలు ఆరోపణలు రావడంతో పాటు, అతడికి వ్యతిరేకంగా బీసీసీఐ కూడా పిర్యాదు చేసింది. దీంతో అతడిని దీర్ఘకాలిక సెలవుపై పంపించి విచారణ చేపట్టారు. ప్రస్తుతం మనూ సాహ్నీ స్థానంలో కొత్త సీఈవో కోసం ఐసీసీ అన్వేషణ ప్రారంభించింది. ఐసీసీ హెచ్ఆర్ కమిటీ త్వరలోనే నియామక ప్రక్రియను ప్రారంభించనున్నట్లు సమాచారం.
ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ సీఈవో టామ్ హారిసన్, క్రికెట్ వెస్టిండీస్ సీఈవో జోనాథాన్ గ్రేవ్స్, ఈసీబీ డైరెక్టర్ ఆఫ్ ఈవెంట్స్ స్టీవ్ ఎల్వర్తీ, ఒక మాజీ దక్షిణాఫ్రికా క్రికెట్ ఈ పదవి కోసం పోటీపడుతున్నట్లు సమాచారం. కరోనా మహమ్మారి కారణంగా పలు ఐసీసీఈవెంట్లు వాయిదా పడ్డాయి. అంతే కాకుండా రానున్న నాలుగేళ్లో పురుష, మహిళలకు చెందిన నాలుగు వరల్డ్ కప్‌లు నిర్వహించాల్సి ఉన్నది. దీంతో సీఈవో నియామక ప్రక్రియ ఎంత వేగవంతం చేస్తే అంత మంచిదని బోర్డు సభ్యులు భావిస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నది.