- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
టీ20 వరల్డ్ కప్ టికెట్ల అమ్మకాలు ప్రారంభం
దిశ, స్పోర్ట్స్: టీ20 వరల్డ్ కప్ ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్నది. తొలి దశ మ్యాచ్‌లు ఒమన్‌లో జరుగనుండగా.. సూపర్ 12 మ్యాచ్‌లు యూఏఈ వేదికగా నిర్వహించనున్నారు. 16 జట్లు పోటీ పడుతున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 45 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇందు కోసం ఐసీసీ టికెట్ల అమ్మకాలు ప్రారంభించింది. ఒమన్, యూఏఈలో మ్యాచ్‌లు చూడాలంటే తప్పనిసరిగా వ్యాక్సినేషన్ చేసుకున్నట్లు ధృవీకరణ పత్రం చూపించాల్సి ఉన్నది. అందుకే కేవలం వ్యాక్సినేషన్ అయిన వాళ్లు మాత్రమే టికెట్లు కొనుగోలు చేయాలని ఐసీసీ కోరింది. టికెట్‌తో పాటు ధృవీకరణ పత్రం ఉంటేనే స్టేడియంలోకి అనుమతిస్తామని పేర్కొన్నది. ఒమన్‌లో జరిగే మ్యాచ్‌లకు 10 ఒమన్ రియల్స్ (రూ. 2 వేలు) టికెట్ ధరగా నిర్ణయించింది. ఇక యూఏఈలో జరిగే మ్యాచ్‌లకు కనీస టికెట్ ధర 30 దిర్హామ్ (రూ. 700)గా నిర్ణయించింది. ఐసీసీ అధికారిక వెబ్‌సైట్ నుంచి ఈ టికెట్లను కొనుగోలు చేయవచ్చని సూచించింది. టీ20 వరల్డ్ కప్‌ను ఐసీసీ – బీసీసీఐ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. దీంతో టికెట్లు ఆదాయం వీరిద్దరే పంచుకోనున్నారు.