- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ఐపీఎల్ లో ఐసీసీ చేస్తోన్న తప్పిదాలేంటి?
దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 2021 రెండో దశలో ఇప్పటికే ఐదు మ్యాచ్‌లు ముగిశాయి. ఈ మ్యాచ్‌లు అన్నీ ఒక్కసారి గమనిస్తే అన్నీ లో స్కోరింగ్ గేమ్సే. పంజాబ్ కింగ్స్ – రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి అత్యధికంగా 368 పరుగులు చేశాయి. ఆ మ్యాచ్ కూడా ఎక్కువగా బౌలర్లకే సహకరించడంతో పంజాబ్ కింగ్స్ రెండు పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక మిగిలిన అన్ని మ్యాచ్‌లలో తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు 160 లోపే టార్గెట్ నిర్దేశించాయి. ఐపీఎల్ అంటేనే ఫ్యాన్స్ అందరూ ధనాధన్ క్రికెట్ ఆశిస్తుంటారు. గతంలో కూడా తరచుగా 200 పైగా పరుగులు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇండియాలో ఐపీఎల్ జరిగినప్పుడు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌లో తప్ప మిగతా అన్ని స్టేడియం లలో సరాసరి తొలి ఇన్నింగ్స్ పరుగులు 175 కంటే ఎక్కువగా ఉన్నాయి. చేపాక్, చినస్వామి, వాంఖడే, ఢిల్లీ స్టేడియంలలో తరచుగా 200 స్కోర్ సెట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు దుబాయ్, అబుదాబి స్టేడియంలలో బ్యాట్స్‌మెన్ భారీగా పరుగులు చేయలేకపోతున్నారు. ఇందుకు కారణం ఐసీసీ తీసుకున్న నిర్ణయమే అని తెలుస్తున్నది.
వరల్డ్ కప్ కోసం..
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లను చూస్తే.. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, అబుదాబి లోని షేక్ జాయేద్ స్టేడియంలో వికెట్ (పిచ్) చాలా పచ్చగా కనపడుతున్నది. వికెట్‌పై చాలా దట్టంగా గడ్డి ఉంటుంది. సాధారణంగా మ్యాచ్‌కు ముందు పెరిగిన గడ్డిని క్యూరేటర్లు తొలగిస్తూ ఉంటారు. కానీ ఐపీఎల్ మ్యాచ్‌లకు గడ్డిని పెద్దగా తొలగించడం లేదు. ఇందుకు కారణం వికెట్‌ను కాపాడుకోవడానికే అని తెలుస్తున్నది. ఐపీఎల్ ముగిసిన వెంటనే ఇవే స్టేడియంలలో టీ20 వరల్డ్ కప్ నిర్వహించనున్నారు. ఐపీఎల్ 2021 ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 1న జరుగనున్నది. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ అక్టోబర్ 17 నుంచి ప్రారంభం కానున్నది. క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ఒమన్‌లో నిర్వహిస్తున్నారు. కానీ సూపర్ 12 మ్యాచ్‌లు మాత్రం యూఏఈలోనే జరుగనున్నాయి. ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడుతున్న వికెట్‌పైనే సూపర్ 12 మ్యాచ్‌లు జరుగుతాయి. ఐపీఎల్ కోసం వికెట్‌ను విపరీతంగా వాడేస్తే పాడయ్యే అకాశం ఉన్నది. అవి వరల్డ్ కప్‌కు పనికిరాకుండా పోయే ప్రమాదం ఉన్నది. అందుకే వికెట్‌పై గడ్డిని తొలగించకుండానే మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. దీంతో పిచ్ పెద్దగా పాడవ్వదు. చిన్నపాటి రిపేర్లు ఉన్నా ఐపీఎల్ తర్వాత ఉన్న రెండు వారాల సమయంలో వికెట్‌ను తిరిగి పునరుద్దరించే అవకాశం ఉంటుంది. అందుకే బీసీసీఐకి ఐసీసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు ఒక క్రీడా పత్రిక కథనం ప్రచురించింది.
లో స్కోరింగ్ అందుకే..
యూఏఈలోని పిచ్‌లు ఎక్కువగా బ్యాట్స్‌మెన్‌కు స్వర్గధామంలా ఉంటాయి. అయితే ఈ సారి బ్యాట్స్‌మెన్‌ను సైతం బౌలర్లు డామినేట్ చేస్తున్నారు. పిచ్‌పై ఉన్న గడ్డిని ఉపయోగించుకొని బౌలర్లు చక్కని బంతులు విసురుతూ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడుతున్నట్లు తెలుస్తున్నది. సాధారణంగా పిచ్‌లు పేసర్లకో, స్పిన్నర్లకో సహకరిస్తుంటాయి. కానీ దుబాయ్, అబుదాబి పిచ్‌లు ఇద్దరికీ సహకరిస్తున్నాయి. ముంబైతో జరిగిన మ్యాచ్ అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలోని వికెట్ చాలా విచిత్రంగా ఉన్నదని అన్నాడు. అటు పేసర్లకు సహకరిస్తూనే స్పిన్నర్లకు కూడా ఉపయోగపడుతుందన్నాడు. పిచ్‌పై గ్రాస్ ఎక్కువగా ఉండటం వల్లే బంతులను అంచనా వేయలేకపోతున్నామని చెప్పారు. ఏదేమైనా ఎప్పుడూ డామినేట్ చేసే బీసీసీఐ.. ఈ సారి ఐసీసీ ఆంక్షల్లో ఐపీఎల్‌ను నిర్వహించాల్సి రావడం ఆశ్చర్యకరమైన విషయమే.