పాయింట్లు తగ్గినా.. టెస్టుల్లో నెంబర్ వన్ స్మిత్

by Shyam |
పాయింట్లు తగ్గినా.. టెస్టుల్లో నెంబర్ వన్ స్మిత్
X

దిశ, స్పోర్ట్స్ : బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియతో జరిగిన తొలి టెస్టులో టీమ్ ఇండియా 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ టెస్టులో ఆస్ట్రేలియన్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ ఘోరంగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో స్మిత్ తక్కువ స్కోరుకే అవుటైనా.. టీమిండియా కెప్టెన్ కోహ్లీ మాత్రం 74 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. దీంతో కోహ్లీ 2 ర్యాంకింగ్ పాయింట్లు సాధించి 888 రేటింగ్‌కు చేరుకున్నాడు. మరోవైపు స్మిత్ బ్యాటింగ్‌లో విఫలమవడంతో రేటింగ్ పాయింట్లు కోల్పోయాడు. అయినా సరే ప్రస్తుతం అతడు 901 పాయింట్ వద్ద ఉన్నాడు. దీంతో స్మిత్ రేటింగ్స్ తగ్గినా ప్రస్తుతానికి తొలి ర్యాంకులోనే కొనసాగుతున్నాడు. ఇక భారత స్పిన్నర్ అశ్విన్ 9 వ ర్యాంకులో, హాజెల్ వుడ్ 5వ స్థానంలోకి చేరుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed