- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఐసీసీ ఛాలెంజ్ లీగ్ ‘ఏ’ రద్దు !
కరోనా దెబ్బకు ఐసీసీ ఛాలెంజ్ లీగ్ ‘ఏ’ రద్దయింది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 16 నుంచి ఆరు జట్లు మలేషియాలో జరిగే ఈ టోర్నీలో పాల్గొనాల్సి ఉంది. కాగా, తూర్పు ఆసియా దేశాల్లో కరోనా ప్రభావం అధికంగా ఉండటంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది.
2023లో జరిగే ప్రపంచ కప్‌లో అర్హత సాధించేందుకు మూడు దశల్లో లీగ్ ‘ఏ’ టోర్నీ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నిర్వహించాల్సింది రెండో దశ మ్యాచ్‌ల్లో కెనడా, డెన్మార్క్, మలేషియా, ఖతార్, సింగపూర్, వనౌటు జట్లు పాల్గొనాల్సి ఉంది. కానీ ప్రస్తుతానికి ఈ మ్యాచ్‌లు వాయిదా వేస్తున్నామని.. కొత్త షెడ్యూల్ త్వరలో ప్రకటిస్తామని ఐసీసీ పేర్కొంది. ఇక ఏప్రిల్‌లో థాయిలాండ్, ఐర్లాండ్, నెదర్లాండ్, జింబాబ్వే మహిళా జట్ల మధ్య జరగాల్సిన నాలుగు దేశాల మహిళా టీ20 ఇంటర్నేషనల్ టోర్నీని కూడా పూర్తిగా రద్దు చేసింది.
మరోవైపు నేపాల్‌లో నిర్వహించాల్సిన ఎవరెస్ట్ ప్రీమియర్ లీగ్‌ను వాయిదా వేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. క్రిస్ గేల్, సందీప్ లమిషానే, మహ్మద్ షెహజాద్ వంటి సీనియర్ క్రికెటర్లు ఈ టోర్నీలో ఆడుతున్నారు. కాని కరోనా ప్రభావంతో ఈ టోర్నీని వాయిదా వేస్తున్నట్లు మేనేజింగ్ డైరెక్టర్ అమీర్ అక్తర్ వెల్లడించారు.
tags : ICC, challenge League, world cup qualifier matches, Amir Actor, Chris Gayle