- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డబ్ల్యూటీసీ కొత్త పాయింట్ల విధానానికి ఆమోదం
దిశ, స్పోర్ట్స్: వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ రెండో సీజన్‌కు సంబంధించిన పాయింట్ల విధానానికి ఐసీసీ ఆమోద ముద్ర వేసింది. 2021-23 డబ్ల్యూటీసీలో ఇకపై మ్యాచ్ గెలిస్తే 12 పాయింట్లు, డ్రా అయితే 4, టై అయితే 6 పాయింట్లు లభిస్తాయి. గతంలో వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఒక సిరీస్ మొత్తానికి 120 పాయింట్లు కేటాయించారు. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ఒక మ్యాచ్ గెలిస్తే 60 పాయింట్లు.. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో మ్యాచ్ గెలిస్తే 30 పాయింట్లు వచ్చేవి. అయితే కోవిడ్ కారణంగా పలు ద్వైపాక్షిక సిరీస్‌లకు ఆటంకం కలగడంతో మధ్యలోనే పాయింట్ల పద్దతిని మార్చి విజయాల శాతాన్ని తెరపైకి తీసుకొని వచ్చారు.
ఇలా చాంపియన్‌షిప్ మధ్యలో పాయింట్ల పద్దతిని మార్చడంపై పలు క్రికెట్ బోర్డుల నుంచి విమర్శలు వచ్చాయి. దీంతోఈ సారి పూర్తి పారదర్శకంగా పాయంట్లను కేటాయిస్తున్నట్లు ఐసీసీ చెప్పింది. క్రికెట్ కమిటీ నుంచి అందిన సూచనల మేరకు ఈ విధానాన్ని ఆమోదించినట్లు ఐసీసీ తాత్కాలిక సీఈవో జెఫ్ అలార్డిస్ చెప్పారు. ఇకపై మ్యాచ్ సంఖ్యతో సంబంధం లేకుండా పాయింట్లు కేటాయించనున్నట్లు ఐసీసీ స్పష్టం చేసింది. వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న ఇంగ్లాండ్-ఇండియా టెస్టు సిరీస్ నుంచే కొత్తపాయింట్ల విధానం అమలులోకి రానున్నది.