- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నమ్మిన సిద్ధాంతం కోసం.. ఎర్రజెండా చేతబట్టి
దిశ, సూర్యాపేట: ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే, రంగారెడ్డి జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు మస్కు నర్సింహ మరణం ప్రజా సామాజిక ఉద్యమాలకు తీరని లోటు వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేకు సంతాప సభను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ… నమ్మిన సిద్ధాంతం కోసం చిన్ననాటి నుండి ఎర్రజెండా చేతబట్టి విద్యార్థి, యువజన, కార్మిక, కర్షక, వ్యవసాయ కూలీల పోరాటాల్లో, ఉద్యమాలలో ముందుండి నడిచిన విప్లవ కారుడు నర్సింహ అని అన్నారు. కుల వివక్షకు వ్యతిరేకంగా అనేక సామాజిక ఉద్యమాల్లో ప్రత్యక్ష పాల్గొని ఉద్యమాలకు నాయకత్వం వహించారని అన్నారు. ఇబ్రహీంపట్నం ప్రాంతంలో దొరలకు, భూ స్వాములకు వ్యతిరేకంగా పేదలను కూడగట్టి అనేక భూ ఉద్యమాలు నిర్వహించారని తెలిపారు. దళిత కుటుంబంలో పుట్టి అనేక కష్టాలు కళ్ళారా చూసి ఈ వ్యవస్థ మారాలని అనేక పోరాటాలు నిర్వహించారని తెలిపారు.