హైదరాబాద్‌లో కొత్త యూనిట్‌ను ఏర్పాటు చేసిన ఐబీఎం!

by Harish |
ibm
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ టెక్ దిగ్గజం ఐబీఎం కార్పొరేషన్ దేశీయంగా హైదరాబాద్‌లో బిజినెస్ ప్రాసెస్ ఆపరేషన్స్ కన్సల్టింగ్ కోసం ప్రత్యేకంగా బీపీఓ యూనిట్‌ను సోమవారం ఏర్పాటు చేసింది. ఈ కొత్త సౌకర్యం ఏర్పాటు ద్వారా అంతర్జాతీయంగా డెలివరీ నెట్‌వర్క్‌లో రెండింతల నియామకాలకు వీలవుతుందని కంపెనీ తెలిపింది. అలాగే ఫైనాన్స్, అకౌంట్స్, సరఫరా వ్యవస్థ, హెచ్ఆర్, నియామకాలు వంటి పరిశ్రమ నిర్దిష్ఠ వ్యాపార కార్యకలాపాలపై దృష్టి సారించనున్నట్టు కంపెనీ పేర్కొంది.

ఈ కొత్త సదుపాయం కారణంగా ఐబీఎం కన్సల్టింగ్ క్లయింట్లు తమ రీ-ఇంజనీరింగ్ నిర్వహణ, డేటా, టెక్నాలజీలో సమగ్రమైన సామర్థ్యాలను పెంపొందించేందుకు సహాయపడుతుందని, తద్వారా వారికి డిజిటల్ టెక్నాలజీకి మారడంలో తోడ్పాటునందిస్తుందని’ ఐబీఎం కంపెనీ వెల్లడించింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఐబీఎం కన్సల్టింగ్, గ్లోబల్ మేనేజింగ్ పార్ట్‌నర్ టోనీ మెనెజెస్.. ఐబీఎం కన్సల్టింగ్ హైబ్రిడ్ క్లౌడ్, ఏఐ సామర్థ్యాల ద్వారా డిజిటల్‌కు మారే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. తెలంగాణలో నైపుణ్యాలతో అంతర్జాతీయంగా తమ వ్యాపార కార్యకలాపాల పోర్ట్‌ఫోలియోలో మెరుగైన వృద్ధి సాధిస్తున్నామనే నమ్మకం ఉందని’ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed