- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్ చేస్తాం: ట్రంప్
వాషింగ్టన్: భారత్‌లో నిషేధానికి గురైన చైనీస్ యాప్ టిక్‌టాక్‌ను అమెరికా కూడా బ్యాన్ చేయడానికి సిద్ధమవుతోంది. శనివారంలోగా నిషేధానికి సంబంధించిన చర్యలు తీసుకోబోతున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. టిక్‌టాక్‌ను విక్రయించాల్సిందిగా దాని మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌కు ట్రంప్ సర్కారు ఆదేశించనున్నట్టు కొన్ని కథనాలు ప్రచురితమైన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్, ఫైనాన్షియల్ సంస్థలు ఈ యాప్‌ను కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉన్నట్టు ది న్యూయార్క్ టైమ్స్, ఫాక్స్ బిజినెస్‌లు రిపోర్ట్ చేశాయి. ఈ నేపథ్యంలోనే టిక్‌టాక్‌ను నిషేధించాలనే భావిస్తున్నట్టు డొనాల్డ్ ట్రంప్ ఎయిర్‌ఫోర్స్ వన్ ద్వారా విలేకరులకు తెలిపారు. తనకు ఆ అధికారమున్నదని నొక్కి చెప్పారు. ఆర్థిక అత్యయికస్థితి లేదా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఈ చర్య తాను తీసుకోవచ్చునని చెప్పారు. దీనిపై వివరణ కోరగా, వదంతులు, వ్యాఖ్యలపై తాము స్పందించబోమని, తమ సంస్థకు దీర్ఘకాల విజయంపై తమకు విశ్వాసమున్నదని టిక్‌టాక్ తెలిపింది.