ఆ హీరో అంటే నాకు చాలా ఇష్టం: డైరెక్టర్ రాజమౌళి

by Anukaran |   ( Updated:2021-12-18 01:45:05.0  )
Rajamouli-1
X

దిశ, వెబ్ డెస్క్: బాహుబలి సినిమాతో టాలీవుడ్ ప్రతిభను మరింత గొప్పగా ప్రపంచానికి పరిచయం చేసిన ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి తాజాగా ఓ విషయం చెప్పారు. తన మనసులో ఉన్న మాటను తెలియజేశారు. తనకు నచ్చిన హీరో ఎవరో చెప్పేశారు. బ్రహ్మాస్త్ర చిత్ర దక్షిణాది మోషన్ పోస్టర్ ను ఆయన విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రమోషన్ లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన పాల్గొని బ్రహ్మాస్త్ర చిత్రంలో నటిస్తున్న ప్రముఖ బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ గురించి మాట్లాడారు. రణ్ బీర్ కపూర్ అంటే బాలీవుడ్ లో తనకు అత్యంత ఇష్టమైన హీరో అని అన్నారు. చూసేందుకు నార్మల్ గా ఉన్నా కూడా అతడిలోపల ఎంతో శక్తి దాగుంటదని, అతని కళ్లలో ఇంటెన్సిటీ కనబడుతదని రాజమౌళీ అన్నారు. అతను పెద్దగా యాక్టింక్ చేస్తున్నట్లు కనబడడు కానీ, చాలా బాగా యాక్టింగ్ చేస్తాడు అని, అందుకే అతనంటే నాకు చాలా ఇష్టమంటూ చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story