- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'రాహుల్ ద్రవిడ్‌కి నిజంగా కోపం రావడం చూశాను'
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ అంటే అందరూ మిస్టర్ కూల్ అంటారు. ఎలాంటి సమయంలో అయినా సంయమనం కోల్పోకుండా ప్రవర్తిస్తుంటాడని ద్రవిడ్‌కి పేరుంది. ఇటీవల ఒక క్రెడిట్ కార్డ్ సంస్థకు చెందిన యాడ్‌లో ద్రవిడ్‌ను ముక్కోపిగా చూపించారు. తనను తాను ‘ఇంద్రానగర్ గూండా’గా సంభోధించుకుంటూ ఇతరులపై విరుచుకపడుతుంటాడు. మిస్టర్ కూల్ ద్రవిడ్‌ను ఇలా ముక్కోపిగా చూపడంపై విమర్శలు వచ్చాయి. ద్రవిడ్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తున్నారంటూ అభిమానులు ఫైర్ అయ్యారు.
అయితే ద్రవిడ్ సహచర క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం ద్రవిడ్‌కు నిజజీవితంలో కూడా కోపం రావడం చూశానని చెప్పాడు. పాకిస్తాన్ పర్యటనకు వెళ్లినప్పుడు జట్టులో ధోనీ కూడా ఉన్నాడు. అప్పుడే కెరీర్ ప్రారంభించిన ధోనీ.. ఒక మ్యాచ్‌లో షాట్ ఆడి పాయింట్ వద్ద క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అప్పుడు ద్రవిడ్ ‘ఇలాగేనా నువ్వు ఆటాడేది. నువ్వు ఆటను ముగించాల్సిన క్రికెటర్‌వి. నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకుంటావా’ అని ధోనీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న వీరేంద్ర సెహ్వాగ్ ఆ ఘటనను దగ్గర నుంచి చూశాడట. అయితే ద్రవిడ్ పూర్తి ఇంగ్లీష్ మాట్లాడుతుండటంతో తనకు సగం అర్దం కూడా కాలేదని చెప్పుకొచ్చాడు. ద్రవిడ్‌కు ఆగ్రహం వస్తే తట్టుకోవడం కష్టమని కూడా చెప్పాడు.