- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, సినిమా : ప్రపంచంలో ప్రతీ ఒక్కరు జీవితకాలంలో ఒక్కసారైనా ఏదో ఒక వ్యాధి బారిన పడుతుంటారు. దానికి ధనవంతులు, సెలబ్రీటీలు అతీతులేం కాదు. అయితే తాజాగా బాలీవుడ్ నటి యామీ గౌతమ్ ‘కెరటోసిస్ పిలారిస్’ అనే అరుదైన చర్మ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన ‘ఒంటిపై కురుపుల వంటి బొడిపెలు’ కలిగివున్న ఫోటోలను సోషల్ మీడియా వేదిక ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ‘కొన్నేళ్లుగా ఈ వ్యాధితో బాధపడుతున్న. ఈ క్రమంలో చాలా రోజులుగా ఇతరులకు తెలియకుండా దాచడానికి చాలా ప్రయత్నించా. కానీ అందరూ అనుకునేంతా భయంకరమైన వ్యాధి ఏం కాదు. చాలా సార్లు నీ వ్యాధి గురించి చెప్పడానికి ఎందుకు ఇబ్బందిపడుతున్నావని నన్ను నేనే ప్రశ్నించుకున్న. అందుకే ఇప్పుడు అందరికి ధైర్యంగా చెబుతున్నా’ అని యామీ తన చర్మ సమస్య గురించి వివరించింది. అలాగే ఈ విషయాన్ని అందరికి చెప్పిన తర్వాత భయాలు, అభద్రత భావాలు, లోపాలను జయించినట్లుగా భావిస్తున్నట్లు పేర్కొన్న నటి.. ఈ వ్యాధికి వైద్యులు ఇంతవరకు చికిత్స కనుక్కొలేకపోయారని చెప్పింది.