టెస్టు జట్టులో ఎవరుంటారో నాకే తెలియదు.. రహానే వింత సమాధానం

by Shyam |
టెస్టు జట్టులో ఎవరుంటారో నాకే తెలియదు.. రహానే వింత సమాధానం
X

దిశ, స్పోర్ట్స్: కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో న్యూజీలాండ్ – ఇండియా మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సీనియర్లు విఫలమైనా అరంగేట్రం బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి జట్టును ఆదుకున్నాడు. అలాగే ఐదో రోజు చివరి రెండు సెషన్లలో భారత బౌలర్లు 9 వికెట్లు తీసి మంచిగా పోరాడాడు. కానీ ఒకే వికెట్ తీయలేక డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో రహానే ఆటగాడిగానే కాకుండా కెప్టెన్‌గా కూడా విఫలమయినట్లు విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ఇక ముంబైలో జరగాల్సిన టెస్టులో కెప్టెన్ కోహ్లీ పునరాగమనం చేయనున్నాడు. ఈ విషయంపై రహానే వ్యాఖ్యానించాడు. రెండో టెస్టుకు కోహ్లీ అందుబాటులోకి వస్తాడు. జట్టులో నుంచి ఎవరో ఒకరు తప్పుకోవాల్సి ఉంటుంది. అయితే తుది జట్టు నుంచి ఎవరిని తప్పిస్తారనే విషయంపై నేను ఏమీ వ్యాఖ్యలు చేయలేను. అసలు జట్టులో ఎవరుంటారనే విషయం నాకు తెలియదు. ఆ ప్రక్రియను జట్టు మేనేజ్‌మెంట్ చూసుకుంటుంది. వాళ్లదే తుది నిర్ణయం అని రహానే వ్యాఖ్యానించాడు.

Advertisement

Next Story