- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘డీజిల్ వాహనాలకు డిమాండ్ తగ్గలేదు’
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కార్ల విక్రయాల్లో డీజిల్ మోడళ్లకు బలమైన డిమాండ్ నమోదైందని, ఈ ఏడాది బీఎస్-6కి మారినప్పటికీ డీజిల్ వాహనాల విక్రయాలను కొనసాగించాలనే తమ ఆలోచనకు ఇది దోహదపడుతోందని హ్యూండాయ్ కంపెనీ సీనియర్ అధికారి తెలిపారు. అనేక వాహన తయారీదారులు డీజిల్ ఇంజిన్‌లను కలిగిన వాహనాలు ఖరీదైనవిగా మారాయని, బీఎస్-6 నిబంధనలు వచ్చిన తర్వాత ఇది మరింత కష్టంగా ఉందని భావించి వాటిని తగ్గించాలని నిర్ణయించాయి.
దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఏప్రిల్ నుంచి బీఎస్-6 నిబంధనలు ప్రారంభమవడంతో డీజిల్ కార్లను నిలిపేయాలని నిర్ణయించింది. ఇత కంపెనీలు కూడా ఇదే బాటను అనుసరించాయి. అయితే, హ్యూండాయ్ మోటార్ ఇండియా మాత్రం డీజిల్ కార్లను కొనసాగించాలని స్పష్టం చేసింది. టాటా మోటార్స్, టయోటా వంటి కంపెనీలు కూడా మల్టీ పర్పస్ వెహికల్స్, ఎస్‌యూవీలవైపు మరలి, చిన్న సామర్థ్యం ఉన్న డీజిల్ ఇంజిన్ వాహనాలను నిలిపేశాయి.
హ్యూండాయ్ మాత్రం డీజిల్ ఇంజిన్ వాహనాలను కొనసాగించాలని, వినియోగదారులకు అవసరమైన వాహనాన్ని ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తామని తెలిపింది. ‘హ్యూండాయ్ క్రెటా డీజిల్ మోడల్ కార్లను ఇప్పటికీ 60 శాతం మంది కస్టమర్లు ఇష్టపడుతున్నారు. అంతేకాకుండా, 32-33 శాతం మంది కస్టమర్లు డీజిల్ వాహనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాము డీజిల్ కార్లను కొనసాగింపునకు నిర్ణయించామని హ్యూండాయ్ మోటార్ ఇండియా సేల్స్, మార్కెటింగ్, సర్వీస్ డైరెక్టర్ తరుణ్ గార్గ్ చెప్పారు.