మంత్రి ఎర్రబెల్లి పర్యవేక్షణలో..

by Shyam |
మంత్రి ఎర్రబెల్లి పర్యవేక్షణలో..
X

దిశ, వరంగల్: రాష్ట్ర పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు తాను పుట్టిన ఊరైన ప‌ర్వ‌త‌గిరి వీధుల్లో కరోనా నివారణకు సోడియం హైపో క్లోరైడ్ పిచికారి చేయించాడు. ఇంటింటికీ మాస్కులు పంపిణీ చేస్తూ నిబంధనల మేరకు, పరిమితంగా ఊరంతా తిరిగారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క‌రోనా క‌ట్ట‌డికి స్వీయ నియంత్ర‌ణ త‌ప్ప‌ వేరే మార్గం లేదన్నారు. ప్రజలు ఖచ్చితంగా ప్రభుత్వ సూచనలు పాటించాలని కోరారు. ఈ విప‌త్క‌ర పరిస్థితుల్లోనూ సేవలందిస్తున్న వైద్యులు, అధికారులు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులను అభినందించారు. మ‌రికొంతకాలం ప్ర‌జ‌లు స‌హ‌క‌రిస్తే కరోనా నివారణ సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌ర్వ‌తగిరి స‌ర్పంచ్, ఎంపీటీసీ, స్థానిక పంచాయ‌తీ సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.
tags: minister errabelli, home, parvathagiri,hypochlorite,spray,mask distribution

Advertisement

Next Story