హైడ్రాక్సీక్లోరోక్విన్ గురించి తెలియని విషయాలు

by vinod kumar |
హైడ్రాక్సీక్లోరోక్విన్ గురించి తెలియని విషయాలు
X

దిశ, వెబ్‌డెస్క్:
అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే కరోనా వ్యాధిగ్రస్తులకు హైడ్రాక్సీక్లోరోక్విన్ ఉపయోగించవచ్చని గతవారం ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో దాదాపు 4000 మందికి ఈ డ్రగ్ ఉపయోగించినట్లు న్యూయార్క్ వైద్యాధికారులు తెలిపారు. అయితే ఈ డ్రగ్ నిజంగానే కరోనాకు ఉపశమనం కలిగిస్తుందా?

ప్లాకెనిల్ బ్రాండ్ పేరుతో ప్రాచుర్యమైన హైడ్రాక్సీక్లోరోక్విన్ మందును మలేరియా చికిత్స కోసం తయారుచేశారు. క్లోరోక్విన్ మందు కంటే ఇది కొద్దిగా తక్కువ డోస్ మందు. అమెరికా మందుల షాపుల్లో దీన్ని ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా పొందొచ్చు. అంతేకాకుండా దీని ఫార్ములాతో ఎన్నో జెనరిక్ వెర్షన్లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

ఫ్రాన్స్‌లో ఓ నలభై మంది పేషెంట్లకు ఈ మందును ఇచ్చి మొదటిసారిగా కరోనా మీద ప్రయోగం చేశారు. వీరిలో 50 శాతం కంటే ఎక్కువ మందికి మూడు రోజుల్లో పరిస్థితి మెరుగుపడింది. అయితే ఇది కరోనా వైరస్‌ను పూర్తిగా చంపేస్తోందన్న దానికి ఆధారాలు లేవు. కేవలం 40 మంది మీదనే ప్రయోగించి తుదినిర్ణయం తీసుకోవద్దని శాస్త్రవేత్తలు కూడా సలహా ఇచ్చారు. కానీ ఏదీ లేకపోవడం కంటే ఏదో ఒకటి ఉండటం మంచిదే కదా అని హైడ్రాక్సీక్లోరోక్విన్‌ని విచ్చలవిడిగా ఉపయోగించడంతో అమెరికాలో స్టాక్ అయిపోయింది.

తర్వాత జరిగిన చైనీస్ పరిశోధనల ప్రకారం హైడ్రాక్సీక్లోరోక్విన్ ఉపయోగించిన పేషెంట్లు, ఉపయోగించకుండా సరైన ట్రీట్‌మెంట్ అనుసరించిన పేషెంట్ల మధ్య తేడా ఏం కనిపించలేదని తేలింది. అంతేకాకుండా ఈ మందు ఉపయోగించిన వారిలో లివర్ పాడవడం, తలనొప్పి, కడుపునొప్పి వంటి సైడ్ ఎఫెక్టులు కనిపించనట్లు తెలిసింది. కాబట్టి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటలు నమ్మి గుడ్డిగా హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడటం మంచిది కాదని శాస్త్రవేత్తలు అంటున్నారు. గతనెల సొంత వైద్యంలో భాగంగా ఇంట్లో ఉన్న హైడ్రాక్సీక్లోరోక్విన్ ఉపయోగించి అర్జెంటీనా దంపతులు చనిపోయిన సంగతి తెలిసిందే.

Tags: Corona, Covid, Argentina, Hydroxychloroquine, Liver damage, America

Advertisement

Next Story

Most Viewed