బిగ్ బ్రేకింగ్ : మంత్రి KTR ట్వీట్.. 32 మంది బీజేపీ కార్పొరేటర్లపై కేసు

by Anukaran |   ( Updated:2021-11-24 05:31:12.0  )
బిగ్ బ్రేకింగ్ : మంత్రి KTR ట్వీట్.. 32 మంది బీజేపీ కార్పొరేటర్లపై కేసు
X

దిశ, వెబ్‌డెస్క్ : తమ డివిజన్ అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయాలంటూ మంగళవారం బీజేపీ కార్పోరేటర్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కార్యాలయంలో ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. పోలీసుల ప్రమేయంతో అది కాస్త తీవ్ర ఉద్రికత్తకు దారి తీసింది. దీంతో బీజేపీ కార్పొరేటర్లు కార్యాలయంలోనికి వెళ్లి ఫర్నిచర్, పూల కుండీలను ధ్వంసం చేశారు. సీఎం కేసీఆర్ ఫోటోలను తొలగించడమే కాకుండా, జీహెచ్ఎంసీ బోర్డుకు నల్ల రంగు వేశారు. అయితే, బీజేపీ కార్పొరేటర్లు చేసిన రచ్చ వలన ఉద్యోగులు భయాందోళనకు గురైనట్టు తెలిసింది. ఈ విషయంపై మున్సిపల్ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

బీజేపీ కార్పొరేటర్లు ‘గాడ్సే భక్తులంటూ’ సంబోధిస్తూనే జీహెచ్ఎంసీ కార్యాలయంలో సృష్టించిన హంగామాపై హైదారాబాద్ సీపీ చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ ద్వారా కోరారు. దీనితో పాటు జీహెచ్ఎంసీ ఉద్యోగులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీజేపీ కార్పొరేటర్లు 32 మందిపై కేసు నమోదు చేసినట్టు నగర పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ప్రధానంగా రాంనగర్, ముసరాంబాగ్, బేగం బజార్, ఆర్కేపురం, గన్ ఫౌండ్రీ కార్పోరేటర్లు ప్రమేయం ఉందని ఉద్యోగులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా జీహెచ్ఎంసీలోని సీసీ టీవీ ఫుటేజ్‌ను సైఫాబాద్ పోలీసులు సేకరించి విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.

Advertisement

Next Story