- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వీడని భయాలు.. మాస్క్‌ల క్రయాలు
దిశ, న్యూస్ బ్యూరో :
కరోనా.. ప్రపంచంలో ఏ ఇద్దరు మాట్లాడుకున్నా ఇదే అంశం. చైనాలో మొదలై ప్రపంచ దేశాలకు వ్యాపించిన ఈ వైరస్ సృష్టించిన భయం మాత్రం సామాన్యమైంది కాదు. వైరస్ లక్షణాలు తామున్న స్థలం నుంచి వందల, వేల కిలోమీటర్ల దూరంలో ఎక్కడ బయటపడ్డా సరే.. తమకూ వస్తుందేమోనన్న భయం జనాల్లో కనిపిస్తోంది. ముందు జాగ్రత్తతో వ్యవహరించడం తప్పేమీ కాదు. కానీ చెప్పేవాడికి ఎటూ లేదు.. వినేవాడికి తెలివి లేకపోతే ఎలా ? అన్నట్టు ప్రచారంలో ఏదీ వస్తే అది పాటించుకుంటూ వెళ్తే ఎలా..?
రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదని స్వయంగా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి మైకులు పగులగొట్టేలా చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన ఒకే ఒక్క అనుమానితుడు సహా అతని కుటుంబసభ్యులు, మిత్రులు, అతనికి వైద్యం అందించిన వైద్య సిబ్బందిని అందరినీ కలిపి 80 మందికి పైగా తమ ఆధీనంలో ఉంచుకొని ఎవరికీ కరోనా సోకలేదని నిర్ధారించారు. అనుమానితులకు ప్రత్యేకంగా ఐసోలేషన్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి నిర్ధారణ, చికిత్స అందించారు. మరో వైపు ఐటీ కంపెనీలపై వస్తున్న వార్తలు, వదంతులపై ప్రభుత్వ సెక్రటరీలు, పోలీస్ కమిషనర్లు స్పందించి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే మరోవైపు కొన్ని మీడియా గ్రూపులు, వైద్యులు కూడా కరోనా వైరస్ పేరు చెప్పి భయపెట్టడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా సోకిన 28 రోజుల్లో మరణిస్తారని తప్పుడు ప్రచారం చేశారని ఓ వైద్యుడిపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. కరోనా వైరస్ భయంకరమైనదే.. ఎవరూ కాదనడం లేదు. అయితే అది సోకిన వ్యక్తి నుంచి మాత్రమే ఇంకొకరికి వ్యాపిస్తుంది. వైరస్ దాడికి గురైన వ్యక్తిని మీరు కలవని సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో మీకు కరోనా వైరస్ సోకదు.
వైరస్ ప్రచారంలోకి వచ్చిన తర్వాత మాస్క్‌ల వ్యాపారం జోరందుకుంది. కానీ కరోనా వైరస్‌ను నియంత్రించే శక్తి అన్ని మాస్క్‌ల్లోనూ లేదు. అయినా డస్ట్ కణాలను నియంత్రించే సాధారణ మాస్క్‌లను కూడా ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు. సోషల్ మీడియా గ్రూపుల్లోనైతే ‘బోడిగుండుకు మోకాలికి లంకె’ పెట్టే ప్రచారాలకు అంతే లేదు. కరోనా వైరస్‌కు తాటి కల్లు విరుగడని ఒకరంటే.. లేదులేదు గోమూత్రం, పేడ సరైన మందని మరొకరు రాస్తారు. గోమాంసంలో ఇంకా ఎక్కువ పవర్ ఉందని కొందరు రాస్తే, హోమియో మందుల పేర్లను, కొత్తకొత్త చెట్ల పేర్లను, నాటు వైద్యాన్ని, వనమూలికా వైద్యాల పేరుతో పోస్టులను హోరెత్తిస్తున్నారు. వీటిలో ఏ ఒక్కదాన్ని కూడా సర్టిఫైడ్ వైద్యులు గానీ, ప్రభుత్వ ఆరోగ్య సంస్థలు గానీ నిర్ధారించలేదు. వైరస్‌ను అడ్డుకునే భ్రమలో అవగాహన లేకుండా ప్రయోగాలు చేసి ఆరోగ్యాలు కోల్పోతే ఎవరిది బాధ్యత.. కొన్ని ఆహార పదార్థాలు, ఔషధాల్లో రోగ నిరోధక శక్తిని పెంచేవి ఉండవచ్చు. అవి గుర్తింపు పొందిన డాక్టర్ల నుంచి.. అదీ రోగ నిర్ధారణ అయిన తర్వాతనే తీసుకోవడం మంచిది తప్ప ఇలాంటి భయాలతో ముందస్తు జాగ్రత్త పేరుతో తీసుకోకపోవడమే ఉత్తమం.
మాస్క్‌లు టాప్… చికెన్ రేట్ డ్రాప్
సంబంధం లేని అంశాలపై విశేష స్పందన ఎలాంటి ప్రభావం చూపుతుందో చెప్పడానికి కరోనా వైరస్ ప్రత్యక్ష ఉదాహరణ. కరోనా భయంతో నగరంతో పాటు జిల్లాల్లో కూడా కరోనా భయానికి మాస్క్‌ల ధరలు పెరిగిపోతున్నాయి. కరోనా సోకిన వ్యక్తి నుంచి వెలువడే ద్రవ వ్యర్థాల ద్వారా మరొకరికి ఇది వ్యాపిస్తుంది. తుమ్మినా, దగ్గినా ఇతరుల సోకకుండా ఉండేందుకు మాత్రమే ప్రస్తుతం కొనుగోళ్లు చేస్తున్న మాస్కుల పని. దాని కోసం జేబు రుమాళ్లు, సాధారణ మాస్క్ వాడినా సరిపోతుంది. అయితే ఇదే అదనుగా కొందరు వ్యాపారులు మాస్క్‌ల పేరుతో ప్రజలను దోచుకుంటున్నారు. పదుల రూపాయల విలువ లేని వాటి కోసం వందల రూపాయలు వసూలు చేస్తున్నారు. చికెన్ తింటే కరోనా వ్యాపిస్తుందని ప్రచారం చేయడంతో రేట్లు భారీగా పడిపోయాయి. స్వయంగా మంత్రులు చికెన్, గుడ్లు తింటూ ప్రచారం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఓ దశలో 75 శాతం వరకూ ధరలు పడిపోయాయని బాలానగర్‌లోని హోల్ సేల్ చికెన్ మార్కెట్ యజమాని ఒకరు తెలిపడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది.
కరోనా వైరస్ విదేశాల్లో పుట్టింది. ఈ వైరస్ సోకిన తర్వాత ఇక్కడికి చేరుకున్న వారి నుంచి అది మరికొందరికి సోకే అవకాశం ఉంది. వారితో మాట్లాడుతున్నప్పుడు లేదా ఆ వ్యక్తి నుంచి వెలువడే లాలజలం, రక్తం, శ్లేష్మం, ఇతర ద్రవపదార్థాలను మరొకరు తాకినపుడు ఇంకొకరికి సోకుతుంది. సాధారణ జలుబు, జ్వరం, దగ్గు ఉన్నవారిలో కరోనా వైరస్ స్వతహాగా అభివృద్ధి చెందదు. సో.. హైదరాబాద్‌లో వైరస్ సోకిందేమో అని అనుమానాలు వ్యక్తమైనపుడు, నిజామాబాద్ మారుమూల గ్రామంలో మాస్క్‌లు ధరించాల్సిన అవసరం లేదు. అతి శుభ్రత పాటించాల్సింది అంతకన్నా లేదు. విదేశాల నుంచి వైరస్ సోకిన వారితో కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తే సరిపోతుంది. దగ్గు, జలుబు ఉన్న ప్రతీ ఒక్కరికీ కరోనా సోకినట్టు కాదు. అలాంటి లక్షణాలు ఉన్నవారు జేబురుమాలు, మాస్క్‌లు వేసుకోవడం కూడా మంచిదే. అయితే అంతా కరోనా కాదు.. అందరికీ అది లేదు.. సో డోంట్ వర్రీ.. బీ కేర్ ఫుల్.. శుభ్రతను ఎప్పుడూ పాటించండి.. అతిగా భయపడకండి. అంతే !
Tgas : corona, mask,health, care, telangana