వ్యాక్సిన్ క్యాపిటల్ గా హైదరాబాద్ : మంత్రి కేటీఆర్

by Shyam |
వ్యాక్సిన్ క్యాపిటల్ గా హైదరాబాద్ : మంత్రి కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ ప్రపంచవ్యాప్త వ్యాక్సిన్ క్యాపిటల్ గా ఉందని, ప్రపంచంలోనే అతిపెద్ద టాప్ టెక్ కంపెనీల భారీ కార్యాలయాలకు హైదరాబాద్ కేంద్రంగా ఉందని మంత్రి కేటీఆర్​అన్నారు. హెచ్​ఐసీసీలో శుక్రవారం ఇండో-ఫ్రెంచ్​ఇన్వెస్ట్​మెంట్ కాంక్లేవ్​కు ఆయన ఫ్రెంచ్ రాయబారి ఇమాన్యుల్ తో కలిసి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉందన్నారు. పరిశ్రమలు, పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకురావడం కోసం రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అనేక విప్లవాత్మకమైన విధానాలను ప్రభుత్వ చేపట్టిందన్నారు. టీఎస్​ఐపాస్ ద్వారా 15 రోజుల్లో అనుమతులిస్తున్నామని, ఇది ఇప్పటికే విజయవంతమై వేలాది పెట్టుబడులను, లక్షలాది ప్రత్యక్ష ఉద్యోగాలను తెలంగాణకు తీసుకొచ్చిందన్నారు.

ప్రభుత్వాలు మారినా ప్రభుత్వ విధానాలు స్థిరంగా ఉండాలన్న స్ఫూర్తితో అనేక కార్యక్రమాలను, పాలనా సంస్కరణలను చేపట్టినట్లు పేర్కొన్నారు. ఫ్రెంచ్ దేశానికి సంబంధించిన భారీ కంపెనీలతో పాటు మధ్యతరహా కంపెనీలను సైతం తెలంగాణ ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉందన్నారు.

Advertisement

Next Story

Most Viewed