- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెన్నయిన్ క్లబ్‌తో హైదరాబాద్ ఎఫ్‌సీ విజయం
దిశ, స్పోర్ట్స్: ఐఎస్ఎల్ 2020/21 సీజన్‌లో భాగంగా ఆదివారం డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరిగాయి. సాయంత్రం తిలక్‌మైదాన్ వేదికగా చెన్నయిన్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఎఫ్‌సీ 2-0 తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి చేరుకుంది. టాస్ గెల్చిన చెన్నయిన్ క్లబ్ ఎడమ నుంచి కుడికి ఎటాక్ చేయడానికి నిర్ణయించుకుంది. వరుసగా మ్యాచ్‌లు డ్రా చేసుకుంటూ వస్తున్న హైదరాబాద్ జట్టు ఎలాగైనా గెలవాలనే కసితో మ్యాచ్‌ను ఆడింది. బంతి ఎక్కువ సేపు చెన్నయిన్ నియంత్రణలోనే ఉన్నా గోల్ పోస్టుపై మాత్రం సరిగా దాడి చేయలేకపోయింది.
హైదరాబాద్ క్లబ్ ఆటగాళ్లు తమకు వచ్చిన అవకాశాలను మాత్రం వదులుకోలేదు. 28వ నిమిషంలో ఫ్రాన్సిస్కో శాండాజా గోల్ కొట్టి హైదరాబాద్‌కు 1-0 ఆధిక్యాన్ని తీసుకొని వచ్చాడు. ఇక 82వ నిమిషంలో జోయల్ చైనీస్ మరో గోల్ చేసి హైదరాబాద్ ఆధిక్యాన్ని 2-0కి తీసుకొని వెళ్లాడు. నిర్ణీత సమయం ముగిసే సరికి హైదరాబాద్ క్లబ్ 2-0 తేడాతో చెన్నయిన్ జట్టుపై విజయం సాధించింది. నాలుగు డ్రాల తర్వాత హైదరాబాద్‌కు ఇదే తొలి విజయం. జోవా విక్టర్ డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ అవార్డు, ఆశిష్ రాయ్‌కి హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
ఇక ఆదివారం రాత్రి ఫర్టోడా స్టేడియంలో జరిగిన మరో మ్యాచ్‌లో కేరళ బ్లాస్టర్స్‌పై ఏటీకే మోహన్ బగాన్ క్లబ్ 3-2 తేడాతో విజయం సాధించింది. 14వ నిమిషంలో గారీ హూపర్ గోల్ చేసి కేరళ బ్లాస్టర్స్‌కు 1-0 ఆధిక్యాన్ని ఇచ్చాడు. తొలి అర్దభాగం ముగిసే వరకు మరో గోల్ నమోదు కాలేదు. 51వ నిమిషంలో కోస్తా నమోయిసు గోల్ చేయడంతో కేరళ బ్లాస్టర్స్ ఆధిక్యం 2-0కు పెరిగింది. 59వ నిమిషంలో మార్సిలిన్హో పెరీరా గోల్ చేసి మోహన్ బగాన్‌కు విజయంపై ఆశకల్పించాడు.
అయితే, కేరళ చేసిన తప్పుకు 65వ నిమిషంలో ఏటీకే మోహన్ బగాన్‌కు పెనాల్టీ లభించింది. కెప్టెన్ రాయ్ కృష్ణ ఎలాంటి తప్పు చేయకుండా దాన్ని గోల్‌గా మలిచాడు. దీంతో స్కోర్ 2-2తో సమానంగా నిలిచింది. కాగా, మ్యాచ్ మరో మూడు నిమిషాల్లో ముగుస్తుంది అనగా రాయ్ కృష్ణ అద్బుతమైన గోల్ చేశాడు. 87వ నిమిషంలో కొట్టిన ఈ గోల్‌తో మోహన్ బగాన్ జట్టు 3-2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. నిర్ణీత సమయం ముగిసే సరికి ఏటీకే మోహన్ బగాన్ 3-2తో విజయం సాధించింది. డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు మన్వీర్ సింగ్, హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు రాయ్ కృష్ణకు లభించింది.