- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్‌లో హుజురాబాద్ ఉప ఎన్నికల ముచ్చట..
దిశ ప్రతినిధి, హైదరాబాద్ : హుజూరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ ఉప ఎన్నిక నగర ప్రజలలో ఆసక్తిని కల్గిస్తోంది. ఎన్నికలకు జీహెచ్ఎంసీకి సంబంధం లేనప్పటికీ ప్రధాన పార్టీల మధ్య నడుస్తున్న మాటల యుద్ధం, హోరాహొరీ ప్రచారం తదితర అంశాలు వారిని ఆకర్షిస్తున్నాయి. ఎన్నికలలో గెలుపు, ఓటములు సహజమైనప్పటికీ హుజూరాబాద్ ఉప ఎన్నిక మాత్రం ప్రధాన పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇటీవల వరకు హుజూరాబాద్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పని చేసిన ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీతో పాటు తన అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నికలు అనివార్యమైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్ ఎలక్షన్ కోసం నోటిఫికేషన్ జారీ చేయనప్పటికీ ప్రధాన పార్టీలు ప్రచారం, పాదయాత్రలు సాగిస్తుండడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
పగలు హుజూరాబాద్‌లో.. రాత్రికి నగరంలో ..
హుజూరాబాద్‌లో త్వరలో జరిగే ఉప ఎన్నికల కోసం హైదరాబాద్ నగరం నుండి నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లి అక్కడ ప్రచారం చేపడుతున్నారు. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలలో ఇది అధికంగా కనబడుతోంది. కాంగ్రెస్ పార్టీ కూడా తమ అభ్యర్థి ఎవరనేది ఇప్పటి వరకు ప్రకటించకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభ్యర్థి ఎవరా అనేది తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇదిలా ఉండగా ఉప ఎన్నికలకు జీహెచ్ఎంసీ పరిధి లోని టీఆర్ఎస్, బీజేపీల నాయకులు, కార్యకర్తలు ఆయా పార్టీల అధిష్టానం గుర్తింపు పొందేందుకు హుజూరాబాద్‌లో ప్రచారానికి తరలివెళ్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్‌లు, కార్పొరేషన్‌ల చైర్మన్ల వంటి వారే కాకుండా అన్ని స్థాయిల నాయకులు హుజూరాబాద్‌లో ఉప ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. వీరే కాకుండా కొంత మంది మంత్రులు, ఎంపీలు కూడా హుజూరాబాద్ లో పర్యటించి టీఆర్ఎస్ పక్షాన ప్రచారం చేపడుతున్నారు. పగలు అక్కడ ప్రచారం చేపట్టి తిరిగి రాత్రికి హైదరాబాద్ చేరుకుంటున్నారు.
ఎక్కడ చూసినా దళిత బంధు చర్చలే….
హైదరాబాద్ నగరంలో ఉద్యోగులు, వ్యాపారులు, నాయకులు, చివరకు కార్మికులు హుజూరాబాద్ ఉప ఎన్నికపై జోరుగా చర్చలు సాగిస్తున్నారు. టీ బండ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు , హోటళ్లు, టిఫిన్ సెంటర్లు ఇలా ఎక్కడ నలుగురు గుమికూడినా ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు జారీ అవుతుంది..? ఎన్నికలు ఎప్పుడు ఉంటాయి..? ఉప ఎన్నికలలో ఎవరు గెలుస్తారు..? సీఎం కేసీఆర్ హుజూరాబాద్ ఉప ఎన్నికలకు ముందు అమలులోకి తెచ్చిన దళిత బంధు కొనసాగుతుందా..? దళితులందరికీ ప్రకటిచినట్లుగా రూ 10 లక్షలు ఇస్తారా..? జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు వరద ముంపు బాధితుల కోసం రూ 10 వేలు ఇచ్చి నిలిపివేసినట్లు కొంతమందికి మాత్రమే దళిత బంధు ఇచ్చి నిలిపివేస్తారా..? ఇలా ఆసక్తికరమైన చర్చలు జోరుగా సాగుతున్నాయి.
ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న టీఆర్ఎస్..
హుజూరాబాద్ ఉప ఎన్నికలలో విజయం సాధించేందుకు టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. 2018లో జరిగిన ఎన్నికలలో పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఈటెల రాజేందర్ గెలుపొందిన విషయం తెలిసిందే. అనంతరం టీఆర్ఎస్ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాల కారణంగా ఈటెల రాజేందర్ పదవిని, పార్టీని వీడిన నేపథ్యంలో తిరిగి ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడం టీఆర్ఎస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. ఎట్టి పరిస్థితులలోనూ బీజేపీలో చేరిన ఈటెల రాజేందర్ కు మరోమారు అవకాశం ఇవ్వరాదనే ఉద్ధేశ్యంతో అధికార పార్టీకి ఉంది. ఈ ఉప ఎన్నికలలో విజయం అధికార పార్టీకి అంత సులువు కాదనే ప్రచారం గ్రేటర్ ప్రజలలో జరుగుతోంది.