ఒక్క లేఖతో హుజురాబాద్ ‘ప్రశాంతం’..

by Sridhar Babu |   ( Updated:2021-08-13 03:41:17.0  )
Huzurabad-by-election
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : మూడున్నర నెలలుగా ప్రముఖుల పర్యటనలు, సభలు, సమావేశాలతో సందడిగా మారిన ఆ నియోజకవర్గం ఒక్క సారిగా మారిపోయింది. తాయిలాలు, విమర్శలు ప్రతి విమర్శలతో దద్దరిల్లిపోయింది. కానీ సడెన్‌గా అక్కడ నిశ్శబ్దం ఆవహించింది. ప్రముఖులు కానరావడం లేదు, ప్రతిపక్ష పార్టీల సందడి కూడా లేకుండా పోయింది. ఉన్నట్టుండి అక్కడ స్తబ్దత నెలకొన్న హుజురాబాద్‌లో ఏం జరుగుతుందో ఓ లుక్కెద్దాం.

రాష్ట్ర రాజకీయాలన్ని కేంద్రీకృతమైన హుజురాబాద్‌లో ఒక్క లేఖ నిశ్శబ్దాన్ని క్రియేట్ చేర్చింది. నేడో రేపో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని హడావుడి చేసిన రాజకీయ పార్టీలన్ని ప్రస్తుతం సైలెంట్ అయ్యాయి. ఎన్నికల కమిషన్ పంపిన లేఖతో ఇప్పట్లో హుజురాబాద్ ఎన్నికలు జరిగే అవకాశం లేదని తేటతెల్లం అయిపోయింది. దీంతో అన్ని రాజకీయ పార్టీల నాయకులు తమ తమ ప్రాంతాలకు తిరుగుముఖం పట్టారు. కరోనా పాండమిక్ నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను ఈ నెల 30లోగా తెలియజేయాలని ఎన్నికల కమిషన్ లేఖను పంపింది. దీంతో ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని భావించిన వివిధ పార్టీలు ప్రచారం చేయడం తాత్కాలికంగా నిలిపివేశాయి. నిన్నటివరకు బలాన్ని పెంచుకునేందుకు విస్తృతంగా చేపట్టిన ప్రచార హంగామాకు ఆ లేఖతో తెరపడినట్టు అయ్యింది. ఎన్నికల కమిషన్ నుండి స్పష్టత వచ్చాక తిరిగి రంగంలోకి దిగాలన్న యోచనతోనే ఆయా పార్టీలు తాత్కాలిక అస్త్ర సన్యాసం చేయాలని నిర్ణయించుకునట్టుగా తెలుస్తోంది.

ఖర్చు భారం..

ఏప్రిల్ 30న ఈటల ఎపిసోడ్ వెలుగులోకి రావడంతో హుజురాబాద్‌లో ఉపఎన్నికల వాతావరణానికి శ్రీకారం చుట్టినట్టయింది. రాజేందర్ రాజీనామా తరువాత ఎలక్షన్ వాతావరణం ఏర్పడింది. అయితే, మూడు నెలలుగా హుజురాబాద్ వైపే అధికార టీఆర్ఎస్, బీజేపీలు దృష్టి సారించాయి. పల్లె పల్లెన తిరుగుతూ ప్రచారాలే చేయడం ఆరంభించాయి. నిరంతరం క్యాంపైన్‌లు చేస్తూ తిరుగుతుండటం వల్ల పార్టీలపై ఆర్థిక భారం పెరిగిందనే చెప్పాలి. స్థానికంగా ఉన్న రాజకీయ సమీకరణాల మార్పులు చేయడం వల్ల కూడా కొన్ని పార్టీలు ఇప్పటికే రూ.కోట్లు వెచ్చించాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఇప్పట్లో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం లేదని భావించిన పొలిటికల్ పార్టీలు తాత్కాలికంగా ప్రచారాన్ని నిలిపివేస్తేనే కొంత ఫైనాన్షియల్ బర్డెన్ తగ్గించుకున్నట్టవుతుందని అంచనా వేసినట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed