కాంగ్రెస్‌లో ఈటల చిచ్చు.. తీవ్రరూపం దాల్చిన నేతల విమర్శలు

by Anukaran |   ( Updated:2021-11-13 07:09:11.0  )
కాంగ్రెస్‌లో ఈటల చిచ్చు.. తీవ్రరూపం దాల్చిన నేతల విమర్శలు
X

దిశ, వెబ్‌డెస్క్: హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాలను తెలంగాణ కాంగ్రెస్‌ సీరియర్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పరోక్షంగా ఈటలకు మద్దతు ప్రకటించి, హుజురాబాద్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్ కూడా రాకుండా చేశారని పలువురు ముఖ్య నేతలు బహిరంగానే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఫలితానికి కారణం ఏంటని అధిష్టానం ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే శనివారం ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయంలో జాతీయ పార్టీ అధిష్టానం దూత కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశం అయ్యారు. కాగా, ఈ సమావేశంలోనూ నేతలు అదే వ్యవహార తీరును ప్రదర్శించినట్లు తెలుస్తోంది. సమావేశంలో ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో కేసీ వేణుగోపాల్ టీ-కాంగ్రెస్ నేతలపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుజురాబాద్‌లో కాంగ్రెస్ ప్రచారానికి పెద్ద ఎత్తున జనాలు వచ్చారని పెద్ద పెద్ద ఫొటోలు పంపారు. కనీసం ప్రచారానికి వచ్చిన వారు కూడా ఓటు వేయలేదా అని ప్రశ్నించారు. అనంతరం వీహెచ్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో మంచి పట్టు ఉన్న కొండా సురేఖకు టికెట్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. దీనిపై రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ ఫిర్యాదు సైతం చేశారని వీహెచ్ గుర్తు చేస్తూ.. ఫిర్యాదు లేఖను కేసీ వేణుగోపాల్‌కు ఇచ్చారు. అనంతరం పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గత ఎన్నికల హుజురాబాద్‌ కాంగ్రెస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి బంధువు అని, మన పార్టీ నేతలన్ని మనం కాపాడుకోలేకపోతే కాంగ్రెస్‌ పతనాన్ని చూడాల్సి వస్తోందని హెచ్చరించారు. దీనికి ఉత్తమ్ స్పందిస్తూ.. జులైలో కాంగ్రెస్ నుంచి కౌశిక్ వెళ్లిపోయారని, అక్టోబర్ వరకూ అభ్యర్థిని ఎందుకు ఫైనల్ చేయలేదని ప్రశ్నించారు. దీంతో టీ-కాంగ్రెస్ నేతల పరస్పర ఆరోపణలతో కార్యకర్తలు ఆందోళనతో పడ్డారు.

Advertisement

Next Story

Most Viewed