బిగ్ బ్రేకింగ్: హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఖరారు

by Anukaran |   ( Updated:3 Oct 2021 12:53 AM  )
BJP logo
X

దిశ, డైనమిక్ బ్యూరో: హుజూరాబాద్ ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ పేరును ఖరారు చేస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేసింది. అయితే, ఇదివరకే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్ఎస్‌యూఐ నేత బల్మూరి వెంకట్, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి‌గా గెల్లు శ్రీనివాస్ యాదవ్ బరిలో ఉన్నారు.

మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. బీజేపీలో చేరడానికి ముందు ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ బరిలోకి దిగి, ఇప్పటికే ఆయన ప్రచారం చేస్తున్నారు. ప్రజా దీవెన పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ నేతలు కూడా గ్రామ గ్రామాన ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్‌లో ఉన్న సమయంలో కంటే బీజేపీలో చేరిన తర్వాత తొలిసారిగా ఉప ఎన్నికను ఎదుర్కొంటున్న ఆయన ఇంకా ఎక్కువగా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన పేరునే ఖరారుస్తూ.. బీజేపీ అధిష్టానం ప్రకటన విడుదల చేసింది.

Etala Rajender

BJP Central Office

Next Story