- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఈటల’ను ఒంటరిని చేయడమే టార్గెట్..?
దిశ ప్రతినిధి, కరీంనగర్ : మంత్రి వర్గం నుండి ఉద్వాసనకు గురైన ఈటల రాజేందర్‌ను గ్రౌండ్ లెవల్ నుంచి ఒంటరిని చేయడమే టార్గెట్‌గా ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఈటల రాజేందర్ ఏరి కోరి హుజురాబాద్ ఏసీపీగా పోస్టింగ్ ఇప్పించుకున్న సుందరగిరి శ్రీనివాస్ రావుపై బదిలీ వేటు పడింది. కొద్దిసేపటి కిందట డీజీపీ జారీ చేసిన బదిలీ ఉత్తర్వుల్లో హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ రావును హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు వెలువడ్డాయి.
రాష్ట్రంలోని ఆరుగురు డీఎస్పీలను బదిలీ చేస్తూ వెలువడిన ఈ ఉత్తర్వుల్లో హుజురాబాద్ ఏసీపీకి కూడా స్థాన చలనం కల్పించారు. రాష్ట్రంలో బదిలీ అయిన డీఎస్పీల వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ టౌన్ డిఎస్పీగా వెంకటేశ్వర్లు, హుజురాబాద్ ఏసీపీగా వెంకట్ రెడ్డి, కామారెడ్డికి సోమానందం, కొత్తగూడెంకు జి.వెంకటేశ్వర్ బాబు, పెద్దపల్లికి సారంగపాణిలకు పోస్టింగ్ ఇస్తూ ఆర్డర్స్ వెలువడ్డాయి. ఇందులో ఒక్క హుజురాబాద్ ఏసీపీని మాత్రమే హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశించడం గమనార్హం.