- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హుజూర్‌నగర్ సబ్ రిజిస్ట్రార్ నగేష్‌పై సస్పెన్షన్ వేటు
దిశ, హుజూర్‌నగర్: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని భూమిని నిబంధనలకు విరుద్ధంగా అక్రమ రిజిస్ట్రేషన్ చేసినందుకు సబ్ రిజిస్ట్రార్ పి.నగేష్‌ను సస్పెండ్ చేస్తూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ ఎమ్.సుభాషిని ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలలోకి వెళితే.. హుజూర్‌నగర్ పట్టణంలోని మాధవరాయిని గూడెంలో కుటుంబ సభ్యుల ధృవీకరణ లేకుండా 450 గజాల భూమిని తన పొరుగు వారికి (డాక్యుమెంట్ నెంబర్ 4174/2021) అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని అదే గ్రామానికి చెందిన బాధితురాలు చప్పిడి సావిత్రి ఫిర్యాదు చేశారు.
ఈ విషయంపై అక్రమ రిజిస్ట్రేషన్ చేశారంటూ పలుమార్లు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వద్ద బాధితులు గొడవ చేశారు. బాధితురాలు, అతని భర్తతో కలిసి ఆఫీస్ ఎదుట పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మరొకమారు ఇరువర్గాలు ఆఫీస్ ఎదుట దాడులకు పాల్పడి ఒకరిపై మరొకరు పోలీసు స్టేషన్‌లో కేసులు పెట్టుకున్నారు. పట్టణంలో హాట్ టాపిక్‌గా మారిన ఈ వివాదంపై జిల్లా రిజిస్ట్రార్ విచారణ చేపట్టగా.. సబ్ రిజిస్ట్రార్ సరియైన వివరణ ఇవ్వలేదని సస్పెన్షన్ ఆర్డర్‌లో తెలిపారు. జిల్లా రిజిస్ట్రార్ ప్రాథమిక నివేదిక తర్వాత హుజూర్ నగర్ సబ్ రిజిస్ట్రార్ పూర్తిగా నిబంధనలను ఉల్లంఘించినట్లు పేర్కొన్నారు. దీంతో ఆరు నెలల పాటు నగేష్ ను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
- Tags
- Huzur Nagar