భార్యను ఎలా అదుపులో పెట్టాలి? వారికి 16 కోట్లమంది భర్తల రిక్వెస్ట్!

by  |   ( Updated:2023-08-10 11:56:54.0  )
భార్యను ఎలా అదుపులో పెట్టాలి? వారికి 16 కోట్లమంది భర్తల రిక్వెస్ట్!
X

దిశ, వెబ్ డెస్క్: సముద్రం లోతైన తెలుసుకోవచ్చు కానీ.. ఆడదాని మనసు లోతును తెలుసుకోలేము అని మగవాళ్ళు అంటూ ఉంటారు. ఆడవారు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు. ఇక పెళ్లైన భర్తల సంగతి అయితే సరేసరి. నా భార్య బాధ తట్టుకోలేకపోతున్నా?.. నా భార్య నన్ను టార్చర్ పెడుతుంది?.. భర్తపై పైచేయి సాధించడానికి భార్య ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తుంటుంది అని ఎంతోమంది భర్తలు తమ భార్యలపై నిందలు వేస్తూ ఉంటారు. అయితే భార్యని కంట్రోల్ చేయడం ఎలా? అనేది ఇప్పటికీ భర్తలకు తెలియని చిదంబర రహస్యమే.. ఆఫీస్ లేనప్పుడు ఇంట్లో భార్యతో కాలక్షేపం చేయడం కన్నా.. గొడవలు పడుతున్న భర్తలే ఎక్కువ.

ఇంతకాలం రోజు ఆఫీస్ కి వెళ్లే సమయం వరకు భరిస్తే చాలు.. ఆఫీస్ కి వెళ్లిపోవచ్చు అనుకునేవారు. కానీ ఈ కరోనా పుణ్యమా అని లాక్ డౌన్ సమయంలో పూర్తిగా ఇంటికి పరిమతమైపోవడంతో భర్తలకు మరో టార్చర్ మొదలయ్యింది. దీంతో గృహ హింస కేసులు ఎక్కువ అయిపోయాయి. ఆఫీస్ ఒత్తిడిలు, పనిభారం , వ్యాపార లావాదేవీల వలన మగవారు వారి కోపాన్ని ఇంట్లో ఉన్న భార్యలపై చూపిస్తున్నారు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇంట్లో ఉంటున్న మగవారు భార్యను కంట్రోల్ లో పెట్టుకోవడం ఎలా? భార్య పై పైచేయి సాధించడం ఎలా? అని గూగుల్ సెర్చ్ చేస్తున్నారని ఒక సర్వే తెలిపింది. ‘గొడవ జరుగుతున్నప్పుడు భార్యను సముదాయించడం ఎలా?’, ‘భార్యను అదుపులో పెట్టడం ఎలా?’.. ‘ఎవ్వరికీ తెలియకుండా భార్యను ఎలా కొట్టాలి?’ అనే విషయాలను దాదాపు 16.50 కోట్ల మంది సెర్చ్ చేసారని ఆ సర్వే తెలిపింది.

ఇక వీటితో పాటు మహిళలు సైతం ‘భర్త వేధింపుల నుండి ఎలా కాపాడుకోవాలి?’, భర్తల హింస తట్టుకోలేక ‘నా భర్త నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు.. ఎలా నన్ను నేను కాపాడుకోవాలి’ లాంటి విషయాలను సెర్చ్ చేసారంట. కరోనా లాక్​డౌన్​ సమయంలో ప్రజలు ఇంటికే పరిమితమవ్వడంతో, తమ సమస్యలను ఎవరికీ చెప్పుకోలేక, గూగుల్​ను ఆశ్రయించారని గూగుల్ సెర్చ్ డేటాను సేకరించిన ఒటాగో విశ్వవిద్యాలయంలో సీనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్న కేటరినా వివరించారు.

Read More : భార్యను ఎలా కంట్రోల్ చేయాలో తెలుసా? భర్తలకు ఇది గుడ్ న్యూసే..!

Advertisement

Next Story

Most Viewed