- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇద్దరికి విడాకులిచ్చిన మహిళ.. మూడో భర్త చేతిలో మర్డర్
by Sumithra |
X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో దారుణం జరిగింది. రాయదుర్గం అంజయ్యనగర్‌లో భార్యపై అనుమానంతో భర్త కత్తితో పొడిచి చంపాడు. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఐదు నెలల క్రితం ఫర్హానా అనే మహిళను ఖాన్ అనే వ్యక్తి ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లి అయినప్పటి నుంచి దంపతుల మధ్య ప్రతిరోజూ గొడవలు జరుగుతున్నాయి. నిన్న మరోసారి గొడవపడిన భార్యభర్తలు.. అర్ధారత్రి సమయంలో మరోసారి తిట్టుకున్నారు. ఇదేక్రమంలో విచక్షణ కోల్పోయిన ఖాన్.. కత్తితో భార్యను పొడిచాడు. తీవ్రగాయాలపాలైన ఫర్హానా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story